పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-235-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వెల్లిగొని నాఁటనుండియు
నుల్లసితం బైన దైవయోగంబున శో
భిల్లెడు మునిమత మంతయు
నుల్లంబున మఱపు పుట్ట దొకనాఁ డైనన్.

టీకా:

వెల్లిగొని = బయటకి వచ్చిన; నాటి = దినము; నుండియున్ = నుండి; ఉల్లసితంబు = వికసించినది; ఐన = అయిన; దైవ = అదృష్ట; యోగంబునన్ = సంయోగమువలన; శోభిల్లెడున్ = ప్రకాశించుచున్నది; ముని = ఋషి యొక్క; మతము = తత్త్వార్థము; అంతయున్ = సమస్తమును; ఉల్లంబునన్ = మనసులో; మఱపు = మరచిపోవుట; పుట్టదు = కలుగదు; ఒకనాడు = ఒకమాటు; ఐనన్ = అయినను.

భావము:

నారదమహర్షికి నా మీద ఉన్న దయవలన, దైవయోగం కలిసిరావటంవలన, నాకు మాత్రం వారి యొక్క ఆ ఉపదేశాలు అన్నీ పుట్టిననాటి నుండి నేటి వరకు ఏ ఒక్కరోజు కూడ ఒక్కటి కూడ నేను మర్చిపోలేదు. చక్కగా అన్నీ గుర్తున్నాయి.”