పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-233-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యోషారత్నము నాథదైవత విశాలోద్యోగ మా తల్లి ని
ర్వైమ్యంబున నాథురాక మదిలో వాంఛించి నిర్దోష యై
యీద్భీతియు లేక గర్భపరిరక్షేచ్ఛన్ విచారించి శు
శ్రూషల్ చేయుచు నుండె నారదునకున్ సువ్యక్త శీలంబునన్.

టీకా:

యొషా = స్త్రీలలో; రత్నము = రత్నమువంటి యామె; నాథదైవత = పతివ్రత {నాథ దైవత - నాథ (భర్తయే) దైవత (భగవంతునిగ గలది), పతివ్రత}; విశాల = విరివి యైన; ఉద్యోగ = సంకల్పము గలామె; మా = మా యొక్క; తల్లి = తల్లి; నిర్వైషమ్యంబునన్ = విషమ భావములు లేకుండగ; నాథు = భర్త యొక్క; రాకన్ = ఆగమనమును; మది = మనసు; లోన్ = అందు; వాంఛించి = కోరి; నిర్దోష = ఏపాపములులేనిది; ఐ = అయ్యి; ఈషత్ = కొంచెము కూడ; భీతియున్ = భయమేమి; లేక = లేకుండ; గర్భ = గర్భమును; పరిరక్ష = కాపాడుకొనెడి; ఇచ్ఛన్ = తలపుతో; విచారించి = ఆలోచించుకొని; శుశ్రూషల్ = సేవలను; చేయుచునుండెన్ = చేయుచుండెను; నారదున్ = నారదుని; కున్ = కి; సువ్యక్త = చక్కగావ్యక్తమగు; శీలంబునన్ = మంచినడవడికతో.

భావము:

మహిళారత్నము, మహా పతివ్రతా, సుసంకల్ప అయిన మా అమ్మ, ఎవ్వరి మీద ద్వేషం పెట్టుకోకుండా, భర్తనే దైవంగా భావిస్తూ, అతని రాక కోసం ఎదురుచూస్తూ ఉండిపోయింది. తన కడుపులో పెరుగుతున్న కుమారుని క్షేమం కోరుకుంటూ, నారదమహర్షికి సేవలు చేస్తూ, ఏ బెదురు లేకుండా, మేలైన నడతతో ఆశ్రమంలో ఉండిపోయింది.