పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-231-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నిర్భీతుండు ప్రశస్త భాగవతుఁడున్ నిర్వైరి జన్మాంతరా
విర్భూతాచ్యుతపాదభక్తి మహిమావిష్టుండు దైత్యాంగనా
ర్భస్థుం డగు బాలకుండు బహుసంగ్రామాద్యుపాయంబులన్
దుర్భావంబునఁ బొంది చావఁడు భవద్దోర్దండ విభ్రాంతుఁ డై."

టీకా:

నిర్భీతుండు = భయములేనివాడు; ప్రశస్త = శ్రేష్ఠుడైన; భాగవతుడున్ = భాగవతుడు; నిర్వైరి = శత్రుత్వములేనివాడు; జన్మాంతర = పూర్వజన్మలనుండి; ఆవిర్భూత = పుట్టిన; అచ్యుత = నారయణుని; పాద = పాదములందలి; భక్తి = భక్తి యొక్క; ప్రభావ = ప్రభావముతో; ఆవిష్టుండు = కూడినవాడు; దైత్య = రాక్షసుని; అంగన = భార్య యొక్క; గర్భస్థుడు = కడుపునగలవాడు; అగు = అయిన; బాలకుండు = పిల్లవాడు; బహు = అనేక విధములైన; సంగ్రామ = యుద్ధము; ఆది = మొదలగు; ఉపాయంబులన్ = ఉపాయములచేత; దుర్భావంబున్ = నికృష్టత్వమును; పొంది = పొంది; చావడు = మరణించడు; భవత్ = నీ యొక్క; దోర్దండ = బాహుబలమునకు; విభ్రాంతుడు = తికమకనొందినవాడు; ఐ = అయ్యి.

భావము:

“దానవేంద్రుడు హిరణ్యకశిపుని భార్య కడుపులో పెరుగుతున్న వాడు భయం అన్నది లేని వాడు. మహా భక్తుడు. పరమ భాగవతోత్తముడు. అతనికి ఎవరూ శత్రువులు కారు. అతను జన్మజన్మల నుంచీ హరిభక్తి సంప్రాప్తిస్తూ వస్తున్న మహా మహిమాన్వితుడు. కాబట్టి ఎన్ని యుద్ధాలు చేసినా, ఎన్ని ఉపాయాలు పన్నినా, నీకు ఎంత బలం ఉన్నా, నీ బాహుపరాక్రమం అతని మీద ఏమాత్రం పనిచేయదు, అతనిని చంపలేవు కనీసం ఏ విధమైన కష్టం కలిగించలేవు.”