పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని జన్మంబు

  •  
  •  
  •  

7-226-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సురేంద్రుండు మా తల్లిం జెఱగొని పోవుచుండ న మ్ముగుద కురరి యను పులుఁగు క్రియ మొఱలిడినఁ దెరువున దైవయోగంబున నారదుండు పొడఁగని యిట్లనియె.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సురేంద్రుండు = దేవేంద్రుడు; మా = మా యొక్క; తల్లిన్ = తల్లిని; చెఱన్ = బందీగా; కొనిపోవుచుండన్ = తీసుకొనిపోవుచుండగా; ఆ = ఆ; ముగుద = ముగ్ధ; కురరి = ఆడులకుముకి; అను = అనెడి; పులుగు = పిట్ట; క్రియన్ = వలె; మొఱలిడినన్ = ఆర్తధ్వానములు చేయుచుండ; తెరువునన్ = దారిలో; దైవ = దేవుని; యోగంబున = వశముచేత; నారదుండు = నారదుడు; పొడగని = కనుగొని, చూచి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా మా తల్లిని చెరబట్టి ఇంద్రుడు తీసుకుపోతుంటే ఆమె ఆడు లకుముకిపిట్ట లాగ రోదించింది. అదృష్టవశాత్తు దైవయోగం కలిసి వచ్చి దారిలో నారదమహర్షి ఇదంతా చూశాడు. అప్పుడు నారదమహర్షి ఇంద్రుడితో ఇలా అన్నాడు.