పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-214-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కంటిరే మనవారు నులు గృహస్థులై-
విఫలులై కైకొన్న వెఱ్ఱితనము;
ద్రార్థులై యుండి పాయరు సంసార-
ద్ధతి నూరక ట్టుబడిరి;
లయోనులం దెల్ల ర్భాద్యవస్థలఁ-
బురుషుండు దేహి యై పుట్టుచుండుఁ
న్నెఱుంగఁడు కర్మతంత్రుఁడై కడపట-
ముట్టఁడు భవశతములకు నయిన

7-214.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

దీన శుభము లేదు దివ్యకీర్తియు లేదు
గతిఁ బుట్టి పుట్టి చ్చి చచ్చి
పొరల నేల మనకుఁ? బుట్టని చావని
త్రోవ వెదకికొనుట దొడ్డబుద్ధి.

టీకా:

కంటిరే = చూసారా; మన = మన; వారు = వాళ్ళు; ఘనులు = గొప్పవారు; గృహస్థులు = కాపురస్థులు; ఐ = అయ్యి; విఫలులు = నిరర్థకులు; ఐ = అయ్యి; కైకొన్న = చేపట్టిన; వెఱ్ఱితనము = పూనిన మూఢత్వము; భద్రార్థులు = క్షేమము(ముక్తి) గోరినవారు; ఐ = అయ్యి; ఉండి = ఉన్నప్పటికిని; పాయరు = విడువరు; సంసార = సాంసారిక; పద్ధతిన్ = మార్గమును; ఊరక = అనవసరముగ; పట్టుబడిరి = చిక్కుకొనిరి; కలయోనులు = లోకమున ఉన్న గర్భములు; అందున్ = లోని; ఎల్ల = అన్నిటను; గర్భా = గర్భవాసము {గర్భాది - 1పుట్టుట 2ఉండుట 3పెరుగుట 4మారుట 5క్షీణించుట 6నశించుట}; ఆది = మొదలగు; అవస్థలన్ = అవస్థలను; పురుషుండు = మానవుడు; దేహి = శరీరధారి; ఐ = అయ్యి; పుట్టుచుండున్ = జన్మించుచుండును; తన్ను = తననుతాను, ఆత్మను; ఎఱుంగడు = తెలిసికొనలేడు; కర్మ = కర్మములకు; తంత్రుడు = వశమైనవాడు; ఐ = అయ్యి; కడపటన్ = అంతు; ముట్టడు = చేరలేడు; భవ = జన్మములు; శతముల = వందలకొలది; కున్ = గా; అయిన = జరిగినను.
దీనన్ = దీనివలన; శుభము = శ్రేయస్సు; లేదు = లేదు; దివ్య = దివ్యమైన; కీర్తియున్ = కీర్తికూడ; లేదు = లేదు; జగతిన్ = ప్రంపంచమునందు; పుట్టిపుట్టి = మరలమరల పుట్టి; చచ్చిచచ్చి = మరలమరల మరణించి; పొరలన్ = పొర్లుట; ఏల = ఎందులకు; మన = మన బాలకు లందరు; కున్ = కు; పుట్టని = పుట్టు కన్నది లేని; చావని = చావు అన్నది లేని; త్రోవన్ = మార్గమును; వెదకికొనుట = వెతుకుకొనుట; దొడ్డబుద్ధి = ఉత్తమమైన ఆలోచన.

భావము:

మీరు చూస్తూనే ఉన్నారు కదా! మన వారు అందరు బలదర్పసంపన్నులు అయిన గొప్ప వారే. కాని పెళ్ళిళ్ళు చేసుకుని గృహస్థులై వెఱ్ఱితనం విడిచిపెట్టరు. ఆనందం కోరుకుంటారు కాని సంసారం అనే ఊబిలో ఊరకే కూరుకుపోతారు. పునర్జన్మలు అనేకం పొందుతూ రకరకాల స్త్రీల గర్భాలలో పడి నానా అవస్థలు పడుతూ, పుడుతూ, చస్తుంటారు. వందల కొద్దీ జన్మలెత్తినా ఈ కర్మబంధాలలో నుండి విముక్తి పొందలేడు. ఈ బాధలు అన్నీ మనకెందుకు? అసలు పుట్టుక అనేదీ, చావు అనేదీ లేని మంచి దారి వెతుక్కోవటం తెలివైన పని కదా!