పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-211-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని రాజకుమారుండు గావునఁ గరుణించి సంగడికాండ్రతోడ నగియెడి చందంబునఁ గ్రీడలాడుచు సమానవయస్కులైన దైత్యకుమారుల కెల్ల నేకాంతంబున నిట్లనియె.

టీకా:

అని = అని; రాజ = రాజు యొక్క; కుమారుండు = పుత్రుడు; కావునన్ = కనుక; కరుణించి = దయచూపి; సంగటికాండ్ర = తోటివారి; తోడన్ = తోటి; నగియెడి = పరిహాసముల; చందంబునన్ = వలె; క్రీడలు = ఆటలు; ఆడుచున్ = ఆడుతూ; సమానవయస్కులు = ఒకే వయసు వారు; ఐన = అయిన; దైత్య = రాక్షస; కుమారుల్ = బాలకుల; కున్ = కు; ఎల్లన్ = అందరకు; ఏకాంతమున = రహస్యముగా; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

రాజకుమారుడు కాబట్టి ప్రహ్లాదుడు తన దానవ సహాధ్యాయులతో చనువుగా, ఇలా వారికి నచ్చచెప్పాడు. ఆడుతూ పాడుతూ వారితో కలిసిమెలిసి మెలగుతూ, వారందరికీ రహస్యంగా ఇలా బోధించాడు.