పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-205-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

కావున వీఁడు మహాప్రభావసంపన్నుండు వీనికెందును భయంబు లేదు; వీనితోడి విరోధంబునం దనకు మృత్యువు సిద్ధించు" నని నిర్ణయించి చిన్నఁబోయి ఖిన్నుండై ప్రసన్నుండు గాక క్రిందు జూచుచు విషణ్ణుండై చింతనంబు జేయుచున్న రాజునకు మంతనంబునఁ జండామార్కు లిట్లనిరి.

టీకా:

కావున = అందుచేత; వీడు = ఇతడు; మహా = గొప్ప; ప్రభావ = మహిమ; సంపన్నుడు = సమృద్ధిగా గలవాడు; వీని = ఇతని; కిన్ = కి; ఎందున్ = ఎక్కడను; భయంబు = భయము; లేదు = లేదు; వీని = ఇతని; తోడి = తోటి; విరోధంబునన్ = శత్రుత్వముతో; తన = తన; కున్ = కు; మృత్యవు = మరణము; సిద్ధించును = కలుగును; అని = అని; నిర్ణయించి = నిశ్చయించుకొని; చిన్నబోయి = చిన్నతనముపడి; ఖిన్నుండు = దుఃఖించువాడు; ఐ = అయ్యి; ప్రసన్నుండు = సంతోషము గలవాడు; కాక = కాకుండగ; క్రిందు = కిందకు, నేలచూపులు; చూచుచున్ = చూచుచు; విషణ్ణుండు = విచారపడువాడు; ఐ = అయ్యి; చింతనంబు జేయుచున్న = ఆలోచించుతున్న; రాజున్ = రాజున; కున్ = కు; మంతనంబునన్ = ఏకాంతముగా, సంప్రదింపులలో; చండామార్కులు = చండామార్కులు; ఇట్లు = ఈ విధముగ; అనిరి = పలికిరి;

భావము:

ఈ ప్రహ్లాదుడు సామాన్యుడు కాదు, గొప్ప శక్తిమంతుడు. దేనికి భయపడడు.” అని ఆలోచించుకుని, “కనుక ఈ పిల్లాడితో విరోధం పెట్టుకుంటే తనకు మృత్యువు తప్ప” దని నిశ్చయించుకున్నాడు. అనవసరంగా ఈ పసివాడిని పెట్టిన బాధలు తలచుకుని చిన్నబుచ్చుకుంటూ, నేల చూపులు చూస్తూ బాధపడుతున్నాడు దానవేంద్రుడు. అప్పుడు హిరణ్యకశిపుడితో చండామార్కులు ఏకాంతంగా ఇలా ధైర్యం చెప్పారు.