పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-204-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గ్రహమునఁ నేఁ జేసిన
నిగ్రహములు పరులతోడ నెఱి నొకనాఁడున్
విగ్రహము లనుచుఁ బలుకఁ డ
నుగ్రహములుగా స్మరించు నొవ్వఁడు మదిలోన్.

టీకా:

ఆగ్రహమునన్ = కోపముతో; నేన్ = నేను; చేసిన = చేసినట్టి; నిగ్రహములు = దండనములు; పరుల = ఇతరుల; తోడన్ = తోటి; నెఱిన్ = వక్రతతో; ఒక = ఒక; నాడున్ = రోజున కూడ; విగ్రహములు = విరోధములుగా; పలుకడు = చెప్పడు; అనుగ్రహములు = సత్కారములు; కాన్ = అయినట్లు; స్మరించున్ = తలచును; నొవ్వడు = బాధపడడు; మది = మనసు; లోన = లోపల.

భావము:

అంతే కాకుండా, నేను కోపంతో వీడిని ఎన్ని రకాల బాధలు పెట్టినా, ఎక్కడా ఎవరి దగ్గర మా నాన్న ఇలా బాధిస్తున్నాడు అంటూ చెప్పుకోడు. పైపెచ్చు అవన్నీ హితములుగానే తలుస్తున్నాడు. మనసులో కూడా బాధ పడడు. వీడి తత్వం ఏమిటో అర్థం కావటంలేదు.