పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-196-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శూములన్ నిశాచరులు స్రుక్కక దేహము నిగ్రహింపఁగా
బాలుఁడు నేలపైఁ బడఁడు పాఱఁడు చావఁడు తండ్రినైన నా
పాలికి వచ్చి చక్రధరు క్షము మానితి నంచుఁ బాదముల్
ఫాము సోఁక మ్రొక్కఁ డనపాయత నొందుట కేమి హేతువో?"

టీకా:

శూలములన్ = శూలములతో; నిశాచరులు = రాక్షసులు; స్రుక్కక = వెనుదీయక; దేహమున్ = శరీరమును; నిగ్రహింపగాన్ = దండింపగా, పొడవగా; బాలుడు = పిల్లవాడు; నేల = భూమి; పైన్ = మీద; పడడు = పడిపోడు; పాఱడు = పరిగెట్టడు; చావడు = మరణించడు; తండ్రిన్ = తండ్రిని; ఐన = అయిన; నా = నా; పాలి = వద్ద; కిన్ = కు; వచ్చి = వచ్చి; చక్రధరు = నారాయణుని; పక్షమున్ = పక్షమును; మానితిన్ = విడిచితిని; అంచున్ = అనుచు; పాదముల్ = కాళ్ళను; ఫాలము = నుదురు; సోకన్ = తగులునట్లు; మ్రొక్కడు = నమస్కరింపడు; అనపాయతన్ = ఆపదలు లేకపోవుట; ఒందుట = పొందుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువో = కారణమో.

భావము:

“ఇంత వీడు ఇంతమంది రాక్షసులు పగతో, పట్టుదలతో బరిసెలతో పొడుస్తుంటే, బాధలు భరించలేక క్రింద పడి దొర్లడు, పోనీ పారిపోడు, “చచ్చిపోతున్నా బాబోయ్” అనడు. కనీసం స్వంత తండ్రిని ఇక్కడే ఉన్నా కదా నా దగ్గరకి వచ్చి నేను ఇంక విష్ణువును ఆరాధించను, నన్ను క్షమించు అని కాళ్ళ మీద సాగిలపడడు. ఇలా ఏమాత్రం బాధ పొందకుండా, ప్రమాదం కలగకుండా ఆనందంగా ఉండటానికి కారణం ఏమిటో తెలియటం లేదు.”