పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-190-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని దానవేంద్రుం డానతిచ్చిన వాఁడి కోఱలు గల రక్కసులు పెక్కండ్రు శూలహస్తులై వక్త్రంబులు తెఱచికొని యుబ్బి బొబ్బలిడుచు ధూమసహిత దావదహనంబునుం బోలెఁ దామ్ర సంకాశంబు లయిన కేశంబులు మెఱయ ఖేదన చ్ఛేదన వాదంబులుఁ జేయుచు.

టీకా:

అని = అని; దానవేంద్రుండు = రాక్షసరాజు; ఆనతిచ్చినన్ = ఆజ్ఞాపించగా; వాడి = పదునైన; కోఱలు = కోరలు; కల = కలిగిన; రక్కసులు = రాక్షసులు; పెక్కండ్రు = అనేకులు; శూల = శూలమును; హస్తులు = చేతులో ధరించినవారు; ఐ = అయ్యి; వక్త్రంబులు = నోళ్ళు; తెఱచికొని = తెరుచుకొని; ఉబ్బి = పొంగిపోతూ; బొబ్బలు = అరుపులు; ఇడుచున్ = పెడుతూ; ధూమ = పొగతో; సహిత = కూడిన; దావదహనంబునన్ = కారుచిచ్చును; పోలెన్ = వలె; తామ్ర = రాగితో; సంకాశంబులు = పొల్చదగినట్టి; కేశంబులున్ = శిరోజములు; మెఱయన్ = మెరుస్తుండగా; ఖేదన = కొట్టండి అనెడి; ఛేదన = నరకండి అనెడి; వాదంబులున్ = అరుపులు; చేయుచున్ = పెడుతూ.

భావము:

ఇలా ప్రహ్లాదుడిని చంపమని దానవేంద్రుడు ఆజ్ఞాపించాడు. పదునైన కోరలు కలిగిన చాలామంది రాక్షసులు చేతులలో శూలాలు పట్టుకుని, భయంకరంగా నోళ్లు తెరచి అరుస్తూ ఉద్రేకంగా గంతులు వేయసాగారు. విరబోసుకున్న ఎఱ్ఱటి జుట్టుతో వాళ్ళు పొగతో వికృతంగా ఉన్న కార్చిచ్చు మంటలు లాగా ఉన్నారు. అలాంటి భీకర ఆకారాలు గల ఆ రాక్షసులు వచ్చి ఆ బాలుడిని తిట్టండి, కొట్టండి అని కేకలు పెడుతూ.....