పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదుని హింసించుట

  •  
  •  
  •  

7-189-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

హంవ్యుఁడు రక్షింపను
మంవ్యుఁడు గాడు యముని మందిరమునకున్
గంవ్యుఁడు వధమున కుప
రంవ్యుం డనక చంపి రం డీ పడుచున్."

టీకా:

హంతవ్యుడు = చంపదగినవాడు; రక్షింపను = కాపాడుటకు; మంతవ్యుడు = యోచింప దగినవాడు; కాడు = కాడు; యముని = యముడి యొక్క; మందిరమున్ = ఇంటి; కున్ = కి; గంతవ్యుడు = పోదగినవాడు; వధమున్ = చంపుట; కున్ = కు; ఉపరంతవ్యుడు = మానదగినవాడు; అనక = అనకుండగ; చంపి = సంహరించి; రండి = రండి; ఈ = ఈ; పడుచున్ = పిల్లవానిని.

భావము:

ఇతడు చంపదగినవాడు. ఏ మాత్రం క్షమించదగినవాడు కాడు. ప్రహ్లాదుడు తక్షణం యమపురికి పంపదగినవాడు. తప్పులు మన్నించకండి. జాలి పడి విడిచిపెట్టకుండా వధించి రండి.”