పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-184-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికిన కొడుకును ధిక్కరించి మక్కువచేయక రక్కసుల ఱేఁడు దన తొడలపై నుండనీక గొబ్బున దిగద్రొబ్బి నిబ్బరంబగు కోపంబు దీపింప వేఁడిచూపుల మింట మంట లెగయ మంత్రులం జూచి యిట్లనియె.

టీకా:

అని = అని; పలికిన = అనుచున్న; కొడుకును = పుత్రుని; ధిక్కరించి = తిరస్కరించి; మక్కువ = గారాబము; చేయక = చేయకుండగ; రక్కసులఱేడు = రాక్షసరాజు; తన = తన యొక్క; తొడల = తొడల; పైన్ = మీద; ఉండనీక = ఉండనీయక; గొబ్బునన్ = వేగముగా; దిగన్ = దిగిపోవునట్లు; ద్రొబ్బి = పడదోసి; నిబ్బరంబు = మిక్కుటము; అగు = అయిన; కోపంబు = కోపము; దీపింపన్ = జ్వలించుచుండగ; వేడి = వేడి; చూపులన్ = చూపు లమ్మట; మింటన్ = ఆకాశమున; మంటలు = మంటలు; ఎగయన్ = చెలరేగ; మంత్రులన్ = మంత్రులను; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా పలుకుతున్న పుత్రుడిని ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు గదిమాడు. ఒక్కసారిగా పుత్ర ప్రేమ పోయింది. ఒళ్ళో కూర్చోబెట్టుకున్న కన్న కొడుకును ఒక్క తోపు తోసేశాడు. తీవ్రమైన కోపంతో కళ్ళల్లోంచి నిప్పులు రాలుతుండగా, మంత్రులతో ఇలా అన్నాడు.