పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-179-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ఒజ్జలు చెప్పని యీ మతి
జ్జాతుఁడ వైన నీకు ఱి యెవ్వరిచే
నుజ్జాత మయ్యె బాలక!
జ్జనులం బేరుకొనుము గ నా మ్రోలన్."

టీకా:

ఒజ్జలు = గురువులు; చెప్పని = చెప్పనట్టి; ఈ = ఇట్టి; మతి = బుద్ధి; మత్ = నాకు; జాతుడవు = పుట్టినవాడవు; ఐన = అయిన; నీ = నీ; కున్ = కు; మఱి = ఇంక; ఎవ్వరి = ఎవరి; చేన్ = వలన; ఉజ్జాతము = పుట్టుట; అయ్యెన్ = జరిగెను; బాలక = పిల్లవాడ; తత్ = అట్టి; జనులన్ = వారిని; పేరుకొనుము = చెప్పుము; తగన్ = సరిగా; నా = నా; మ్రోలన్ = ఎదుట.

భావము:

“ప్రహ్లాదా! నువ్వేమో చిన్న పిల్లాడివి. ఈ విషయాలు మీ ఉపాధ్యాయులు చెప్ప లేదు. మరి నా కడుపున పుట్టిన నీకు ఇలాంటి బుద్ధులు ఎలా వచ్చాయి? నీకు ఇవన్నీ ఎవరు చెప్పారు? వాళ్లెవరో నాకు చెప్పు.”