పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-177-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

మిత్రులము పురోహితులము
పాత్రుల మే మదియుఁ గాక భార్గవులము నీ
పుత్రుని నిటువలెఁ జేయఁగ
త్రులమే? దైత్యజలధిచంద్రమ! వింటే."

టీకా:

మిత్రులము = స్నేహితులము; పురోహితులము = ఆచార్యులము; పాత్రులము = తగినవారము; అదియుగాక = అంతేకాకుండగ; భార్గవులము = భృగువు వంశపు వారము; నీ = నీ యొక్క; పుత్రుని = కుమారుని; ఇటు = ఈ; వలెన్ = విధముగ; చేయగన్ = చేయుటకు; శత్రువులమే = విరోధులమా ఏమి; దైత్యజలనిధిచంద్రమ = హిరణ్యకశిపుడ {దైత్యజలనిధిచంద్రమ - దైత్య (రాక్షస) కుల మనెడి జలనిధి (సముద్రమునకు) చంద్రమ (చంద్రుని వంటివాడు), హిరణ్యకశిపుడు}; వింటే = వింటివా.

భావము:

ఓ రాక్షసరాజా! నువ్వు రాక్షస కులం అనే సముద్రానికి చంద్రుని వంటి వాడవు. వినవయ్యా! మేము నీకు ముందు నుండి స్నేహితులము, పురోహితులము, మంచి యోగ్యులము. అంతే కాదు భృగువంశంలో పుట్టినవాళ్ళం. మేము నీకు మేలు కోరే వాళ్ళము తప్ప, నీ కుమారుడికి ఇలా బోధించడానికి మేము శత్రువులము కాదయ్యా!”