పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-176-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"ప్పులు లేవు మావలన దానవనాథ! విరోధిశాస్త్రముల్
చెప్పము క్రూరులై పరులు చెప్పరు మీ చరణంబులాన సు
మ్మెప్పుడు మీ కుమారునకు నింతయు నైజమనీష యెవ్వరుం
జెప్పెడిపాటి గాదు ప్రతిచింతఁ దలంపుము నేర్పుకైవడిన్.

టీకా:

తప్పులు = తప్పులు; లేవు = చేయబడలేదు; మా = మా; వలన = చేత; దానవనాథ = రాక్షసరాజా; విరోధి = శత్రువుల; శాస్త్రముల్ = చదువులు; చెప్పము = చెప్పలేదు; క్రూరులు = క్రూరమైనవారు; ఐ = అయ్యి; పరులు = ఇతరులు ఎవరును; చెప్పరు = చెప్పలేదు; మీ = మీ యొక్క; చరణంబులు = పాదముల; ఆన = మీద ఒట్టు; సుమ్ము = సుమా; ఎప్పుడున్ = ఎప్పుడును; మీ = మీ; కుమారున్ = పుత్రుని; కున్ = కి; నైజ = సహజసిద్ధమైన; మనీష = ప్రజ్ఞ, బుద్ధి; ఎవ్వరున్ = ఎవరు కూడ; చెప్పెడిపాటి = చెప్పగలంతవారు; కాదు = కాదు; ప్రతి = విరుగుడు; చింతన్ = ఆలోచన; తలంపుము = విచారింపుము; నేర్పు = మంచి నేర్పైన; కై = కోసము; వడిన్ = శ్రీఘ్రమే.

భావము:

“ఓ రాక్షసరాజా! మా వల్ల ఏ తప్పు జరగలేదు. నీకు వ్యతిరేకంగా మేము ఎప్పుడూ ప్రవర్తించము. నీ పుత్రుడికి మేము విరోధి కథలు చెప్పము, చెప్పలేదు. మరి ఎవరూ అంత సాహసం చేసి చెప్పలేదు. నీ పాదాల మీద ఒట్టు. మీ వాడికి సహజంగా అబ్బిన బుద్ధే తప్ప ఒకరు చెప్తే వచ్చింది కాదు. కాబట్టి ప్రస్తుతం దీనికి ప్రతిక్రియ జాగ్రత్తగా శీఘ్రమే ఆలోచించు.