పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-173-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"టుతర నీతిశాస్త్రచయ పారగుఁ జేసెద నంచు బాలు నీ
టు గొనిపోయి వానికి నర్హము లైన విరోధిశాస్త్రముల్
కుటిలతఁ జెప్పినాఁడవు భృగుప్రవరుండ వటంచు నమ్మితిన్
కట! బ్రాహ్మణాకృతివి గాక యథార్థపు బ్రాహ్మణుండవే?

టీకా:

పటుతర = మిక్కిలి దృఢమైన {పటు - పటుతరము - పటుతమము}; నీతి = నీతి; శాస్త్ర = శాస్త్రముల; చయ = సమూహము నందు; పారగున్ = నేర్పరునిగా, చివరదాక చదివిన వానినిగా; చేసెదన్ = చేసెదను; అంచున్ = అనుచు; బాలున్ = పిల్లవానిని; నీవు = నీవు; అటు = అలా; కొనిపోయి = తీసుకు వెళ్ళి; వాని = వాని; కిన్ = కి; అనర్హములు = తగనట్టివి; ఐన = అయిన; విరోధి = పగవాని; శాస్త్రముల్ = చదువులు; కుటిలతన్ = కపటత్వముతో; చెప్పినాడవు = చెప్పితివి; భృగు = భృగువు వంశపు; ప్రవరుండవు = శ్రేష్ఠుడవు; అటంచున్ = అనుచు; నమ్మితిని = నమ్మితిని; కటకట = అయ్యో; బ్రాహ్మణ = బ్రాహ్మణుని; ఆకృతివి = రూపు ధరించిన వాడవు; కాక = అంతేకాని; యథార్థపు = నిజమైన; బ్రాహ్మణుండవే = బ్రాహ్మణుడవేనా.

భావము:

“నా కొడుకుని తీసుకు వెళ్లి నీతి పాఠాలు బాగా నేర్పుతాను అన్నావు. ద్రోహబుద్ధితో అతనికి శత్రువు విష్ణుమూర్తి కథలు నూరిపోశావా. అయ్యయ్యో! పవిత్రమైన భృగువంశంలో పుట్టిన గొప్ప వాడివి అని నమ్మి నా కొడుకును నీకు అప్పజెప్పాను కదయ్యా. బ్రాహ్మణ ఆకారంలో ఉన్నావు కాని నువ్వు నిజమైన బ్రాహ్మణుడవు కాదు. నిజమైన బ్రాహ్మణుడవు అయితే సరైన చదువు చెప్తానని ఇలా మోసం చేస్తావా?