పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-163-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చోద్యం బయ్యెడి నింతకాల మరిగెన్ శోధించి యేమేమి సం
వేద్యాంశంబులు చెప్పిరో? గురువు లే వెంటం బఠింపించిరో?
విద్యాసార మెఱుంగఁ గోరెద భవ ద్విజ్ఞాత శాస్త్రంబులోఁ
ద్యం బొక్కటి చెప్పి సార్థముగఁ దాత్పర్యంబు భాషింపుమా.

టీకా:

చోద్యము = ఆశ్చర్యము; అయ్యెడిన్ = అగుతున్నది; ఇంతకాలము = ఇన్నిదినములు; అరిగెన్ = గడచిపోయినవి; శోధించి = పరిశీలించి; ఏమేమి = ఎటువంటి; సంవేద్య = తెలిసికొనదగిన; అంశంబులు = సంగతులు; చెప్పిరో = నేర్పినారో; గురువులు = గురువులు; ఏ = ఏ; వెంటన్ = విధముగ; పఠింపించిరో = చదివించినారో; విద్యా = విద్యల యొక్క; సారమున్ = సారాంశమును; ఎఱుంగన్ = తెలిసికొన; కోరెదన్ = కోరుచున్నాను; భవత్ = నీకు; విజ్ఞాత = తెలుసుకొన్న; శాస్త్రంబు = చదువుల; లోన్ = లోని; పద్యంబున్ = పద్యమును; ఒక్కటి = ఒక దానిని; చెప్పి = చెప్పి; సార్థముగాన్ = అర్థముతో కూడ; తాత్పర్యంబున్ = తాత్పర్యమును; భాషింపుమా = చదువుము.

భావము:

“నాయనా! ఎంతకాలం అయిందో నువ్వు చదువులకు వెళ్ళి? వచ్చావు కదా. చాలా చిత్రంగా ఉంది. మీ గురువులు ఏమేం క్రొత్త క్రొత్త విషయాలు చెప్పారు? నిన్ను ఎలా చదివించారు? నువ్వు చదువుకున్న చదువుల సారం తెలుసుకోవాలని ఉంది. నువ్వు నేర్చుకున్న వాటిలో నీకు ఇష్టమైన ఏ శాస్త్రంలోది అయినా సరే ఒక పద్యం చెప్పి, దానికి అర్థం తాత్పర్యం వివరించు వింటాను.