పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-161-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"శిక్షించితి మన్యము లగు
క్షంబులు మాని నీతిపారగుఁ డయ్యెన్
క్షోవంశాధీశ్వర!
వీక్షింపుము; నీ కుమారు విద్యాబలమున్."

టీకా:

శిక్షింతిమి = చక్కగా బోధించితిమి; అన్యములు = శత్రువులవి; అగు = అయిన; పక్షంబులు = త్రోవలు; మాని = విడిచి; నీతి = నీతిశాస్త్రమును; పారగుడు = తుదిముట్టినవాడు; అయ్యెన్ = అయ్యెను; రక్షోవంశాధీశ్వర = హిరణ్యకశిపుడ {రక్షోవంశాధీశ్వరుడు - రక్షః (రాక్షస) వంశా (కులమునకు) అధీశ్వరుడు (ప్రభువు), హిరణ్యకశిపుడు}; వీక్షింపుము = పరిశీలించుము; నీ = నీ యొక్క; కుమారు = పుత్రుని; విద్యా = చదువు లందలి; బలమున్ = శక్తిని.

భావము:

“ఓ రాక్షస రాజా! హిరణ్యకశిపా! నీ కుమారుడిని చక్కగా శిక్షించి చదివించాము. శత్రుపక్షముల పైనుండి మనసు మళ్ళించాం. నీ కుమారుడిని నీతికోవిదుణ్ణి చేశాం. అన్ని విద్యలలో గొప్ప పండితు డయ్యాడు. మీ కుమారుడి విద్యను పరీక్షించవచ్చు.”
అన్నారు చండామార్కులు