పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-156-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భార్గవనందనుఁ డతనికి
మార్గము చెడకుండఁ బెక్కు మాఱులు నిచ్చల్
ర్గత్రితయము చెప్పె న
ర్గళ మగు మతివిశేష మర నరేంద్రా!

టీకా:

భార్గవనందనుడు = శుక్రుని కొడుకు; అతని = అతని; కిన్ = కి; మార్గము = దారి; చెడకుండగ = తప్పిపోకుండగ; పెక్కు = అనేక; మాఱులు = పర్యాయములు; నిచ్చల్ = ప్రతిదినము; వర్గత్రితయమున్ = ధర్మార్థకామములను; చెప్పెన్ = చెప్పెను; అనర్గళము = అడ్డులేనిది; అగు = అయిన; మతి = బుద్ధి; విశేష = విశిష్టత; అమరన్ = ఒప్పునట్లు; నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నర( మానవులకు) ఇంద్రుడు (ప్రభువు), రాజు}.

భావము:

ధర్మరాజా! అలా శుక్రాచార్యుడి కొడుకు ఆ గురువు తన చాతుర్యం అంతా చూపి, ప్రహ్లాదుడికి వాళ్ళ సంప్రదాయం ప్రకారం అనేక విద్యలు ఏకాంతంగా చెప్పారు. ధర్మశాస్త్రం, అర్థశాస్త్రం, కామ శాస్త్రం అనే త్రితయాలను ఎడ తెగకుండా బోధించాడు. అనర్గళమైన తెలివితేటలు అమరేలా ఆయా విషయాలను అనేక సార్లు వల్లింప జేశాడు.