పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-153-చ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

యుఁడు గాఁడు శాత్రవుఁడు దానవభర్తకు వీఁడు దైత్య చం
వనమందుఁ గంటక యు క్షితిజాతము భంగిఁ బుట్టినాఁ
వరతంబు రాక్షసకులాంతకుఁ బ్రస్తుతి చేయుచుండు, దం
మునఁ గాని శిక్షలకు డాయఁడు పట్టుఁడు కొట్టుఁ డుద్ధతిన్."

టీకా:

తనయుడు = పుత్రుడు; కాడు = కాడు; శాత్రవుడు = విరోధి; దానవభర్త = హిరణ్యకశిపుని; కున్ = కి; వీడు = ఇతడు; దైత్య = రాక్షస (వంశము) యనెడి; చందన = గంధపుచెట్ల; వనము = అడవి; అందున్ = లో; కంటక = ముళ్లుతో; యుత = కూడిన; క్షితిజాతము = చెట్టు {క్షితిజాతము - క్షితి (నేల)లో జాతము (పుట్టినది), చెట్టు}; భంగిన్ = వలె; పుట్టినాడు = జన్మించెను; అనవరతంబున్ = ఎల్లప్పుడు; రాక్షసకులాంతకున్ = నారాయణుని {రాక్షసకులాంతకుడు - రాక్షస కుల (వంశమును) అంతకుడు (నాశనముచేయువాడు), విష్ణువు}; ప్రస్తుతిన్ = మిక్కిలి కీర్తించుటను; చేయుచుండున్ = చేయుచుండును; దండనమునన్ = కొట్టుటవలన; కాని = తప్పించి; శిక్షల్ = చదువుచెప్పు పద్ధతుల; కున్ = కు; డాయడు = చేరడు; పట్టుడు = పట్టుకొనండి; కొట్టుడు = కొట్టండి; ఉద్ధతిన్ = మిక్కిలిగా.

భావము:

హిరణ్యకశిప మహారాజుకు శత్రువు తప్పించి వీడు కొడుకు కాడు. నిర్మలమైన రాక్షస కులం అను గంధపు తోటలో ఈ దుర్మాత్ముడు ముళ్ళ చెట్టులా పుట్టాడు. ఎప్పుడూ రాక్షస కులాన్ని నాశనం చేస్తున్న విష్ణువును నుతిస్తాడు. వీడిని కఠినంగా దండిస్తే గాని చదువుల దారికి రాడు. పట్టుకొని గట్టిగా కొట్టండి.”
అని గురువు చండామార్కులు హిరణ్యకశిపుడితో మళ్ళీ ఇలా అన్నారు.