పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-148-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

జ్ఞుల్ కొందఱు నేము దా మనుచు మాయం జెంది సర్వాత్మకుం
బ్రజ్ఞాలభ్యు దురన్వయక్రమములన్ భాషింపఁగా నేర రా
జిజ్ఞాసాపథమందు మూఢులు గదా చింతింప బ్రహ్మాది వే
జ్ఞుల్ తత్పరమాత్ము విష్ణు నితరుల్ ర్శింపఁగా నేర్తురే?

టీకా:

అజ్ఞుల్ = అజ్ఞానులు, జ్ఞానము లేనివారు; కొందఱు = కొంతమంది; నేము = మేము; తాము = వారు; అనుచున్ = అనుచు; మాయన్ = మోహమును; చెంది = పొంది; సర్వాత్మకున్ = నారాయణుని {సర్వాత్మకుడు - సమస్తమునందు ఆత్మగ ఉండువాడు - సర్వాంతర్యామి, విష్ణువు}; ప్రజ్ఞాలభ్యున్ = నారాయణుని {ప్రజ్ఞాలభ్యుడు - బుద్ధిబలముచేత అందని వాడు, విష్ణువు}; దురన్వయ = అసంబద్ద అన్వయములైన; క్రమములన్ = విధానములతో; భాషింపగాన్ = పలుకుటను; నేరరు = చేయలేరు; ఆ = ఆ; జిజ్ఞాసాపథము = బ్రహ్మజ్ఞానం తెలిసికొనెడి మార్గము; అందున్ = లో; మూఢులు = మూర్ఖులు; కదా = కదా; చింతింపన్ = భావించుట; బ్రహ్మ = బ్రహ్మదేవుడు; ఆది = మొదలగువారు; వేదజ్ఞులు = వేదము తెలిసినవారు; తత్ = అట్టి; పరమాత్మున్ = నారాయణుని; విష్ణున్ = నారాయణుని; ఇతరుల్ = ఇతరులు; దర్శింపగాన్ = దర్శించుటను; నేర్తురే = చేయగలరా ఏమి.

భావము:

కొందరు అజ్ఞానంలో పడి తాము వేరు, పరులు వేరు అనే మాయ అనే భ్రాంతిలో ఉంటారు. దాంతో సర్వాత్మకుడు అయిన భగవంతుడిని ఎంత తెలివితేటలూ, పాండిత్యం ఉపయోగించినా కూడా తెలుసుకోలేరు. ఆ విష్ణుమూర్తిని పరమాత్ముడిని బ్రహ్మ వంటి వేద విజ్ఞాన మూర్తులు కూడా తెలుసుకోలేని వారే. ఇక ఇతరులు సామాన్యులు ఆ పరాత్పరుడు అయిన విష్ణుమూర్తిని ఎలా దర్శించగలరు!