పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-147-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అనినఁ దండ్రిమాటలకుఁ బురోహితు నిరీక్షించి ప్రహ్లాదుం డిట్లనియె "మోహ నిర్మూలనంబు జేసి యెవ్వని యందుఁ దత్పరులయిన యెఱుకగల పురుషులకుం బరులు దా మనియెడు మాయాకృతం బయిన యసద్గ్రాహ్యంబగు భేదంబు గానంబడ దట్టి పరమేశ్వరునకు నమస్కరించెద.

టీకా:

అనినన్ = అనగా; తండ్రి = తండ్రి యొక్క; మాటలు = పలుకుల; కున్ = కు; పురోహితుని = గురువును; నిరీక్షించి = ఉద్ధేశించి; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; మోహ = మోహమును; నిర్మూలనంబున్ = పూర్తిగా పోగొట్టబడినదిగా; చేసి = చేసి; ఎవ్వని = ఎవని; అందున్ = ఎడల; తత్పరులు = తగిలి యుండువారు; అయిన = ఐన; ఎఱుక = తెలివి; కల = కలిగినదా లేక; పురుషుల్ = మానవుల; కున్ = కు; పరులు = ఇతరులు; తాము = తాము; అనియెడు = అనెడి; మాయా = మాయచేత; కృతంబు = కలిగించబడినది; అయిన = ఐన; అసత్ = అసత్తుచేత, మిథ్యాగా; గ్రాహ్యంబు = తెలియునది; అగు = అయిన; భేదంబు = భేదభావము; కానంబడదు = కనబడదు; అట్టి = అటువంటి; పరమేశ్వరున్ = నారయణుని {పరమేశ్వరుడు - పరమ (అత్యున్నత మైన) ఈశ్వరుడు, విష్ణువు}; కున్ = కి; నమస్కరించెద = నమస్కారము చేసెదను.

భావము:

ఇలా చెప్పిన తండ్రి మాటలు విని ప్రహ్లాదుడు గురువు చండామార్కులను చూసి ఇలా అన్నాడు “జ్ఞానులు మోహం తొలగించుకొని భగవంతుని అందు ఏకాగ్ర భక్తి ప్రపత్తులతో ఉంటారు. అట్టి వారికి తమ పర భేదం అనే మాయా మోహం అంటదు. ఆ భగవంతుడు విష్ణుమూర్తికి నమస్కరిస్తున్నాను.