పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-146-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

సులం దోలుటయో, సురాధిపతులన్ స్రుక్కించుటో, సిద్ధులం
రివేధించుటయో, మునిప్రవరులన్ బాధించుటో, యక్ష కి
న్న గంధర్వ విహంగ నాగపతులన్ నాశంబు నొందించుటో,
రి యంచున్ గిరి యంచు నేల చెడ మోహాంధుండవై పుత్రకా!

టీకా:

సురలన్ = దేవతలను; తోలుటయో = తరుముట సరికాని; సురా = దేవతల యొక్క; అధిపతులన్ = ప్రభువులను; స్రుక్కించుటో = భయపెట్టుట సరికాని; సిద్ధులన్ = సిద్ధులను; పరివేధించుటయో = పీడించుట సరికాని; ముని = మునులలో; ప్రవరులన్ = శ్రేష్ఠులను; బాధించుటో = బాధపెట్టుట సరికాని; యక్ష = యక్షులు; కిన్నర = కిన్నరలు; గంధర్వ = గంధర్వులు; విహంగ = పక్షులు; నాగ = నాగవాసుల; పతులన్ = ప్రభువులను; నాశంబున్ = నాశనము; ఒందించుటో = చేయుట సరికాని; హరిన్ = హరి; అంచున్ = అనుచు; గిరి = గిరి; అంచున్ = అనుచు; ఏల = ఎందులకు; చెడన్ = చెడిపోవుట; మోహ = మోహముచే; అంధుడవు = గుడ్డివాడవు; ఐ = అయ్యి; పుత్రకా = కుమారుడా.

భావము:

కుమారా! ప్రహ్లాదా! దేవతలను పారదోలవయ్యా. లేకపోతే దేవతా విభులను పట్టి చావబాదటం కాని, సిద్ధులను బాగా వేధించటం కాని మునీశ్వరులను బాధించటం కాని, లేదా యక్షులు, కిన్నరులు, గంధర్వులు, పక్షి రాజులు, నాగరాజులను చంపటం కాని చెయ్యాలి. ఇలా చేయటం మన ధర్మం. అది మానేసి, హరి అంటూ గిరి అంటూ అజ్ఞానం అనే అంధకారంతో ఎందుకు మూర్ఖుడిలా చెడిపోతున్నావు.”