పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-143-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని కుమారకుం డాడిన ప్రతిపక్షానురూపంబు లయిన సల్లాపంబులు విని దానవేంద్రుండు నగుచు నిట్లనియె.

టీకా:

అని = అని; కుమారకుండు = పుత్రుడు; ఆడిన = పలికిన; ప్రతిపక్ష = విరోధులకు; అనురూపంబులు = అనుకూలమైనవి; అయిన = ఐన; సల్లాపంబులున్ = మాటలను; విని = విని; దానవేంద్రుడు = హిరణ్యకశిపుడు; నగుచున్ = నవ్వుతూ; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా శత్రు పక్షానికి అనుకూలమైన మాటలు మాట్లాడుతున్న కొడుకు సల్లాపాలు విని, ఆ రాక్షసరాజు హిరణ్యకశిపుడు నవ్వుతూ ఇలా అన్నాడు.