పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-141-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని మఱియుఁ "బుత్రా! నీ కెయ్యది భద్రంబై యున్నది; చెప్పు" మనినఁ గన్నతండ్రికిఁ బ్రియనందనుం డిట్లనియె.

టీకా:

అని = అని; మఱియున్ = ఇంకను; నీ = నీ; కున్ = కు; ఎయ్యది = ఏది; భద్రంబు = చక్కగావచ్చి, శుభమై; ఉన్నది = ఉన్నది; చెప్పుము = చెప్పుము; అనినన్ = అనగా; కన్న = జన్మనిచ్చిన; తండ్రి = తండ్రి; కిన్ = కి; ప్రియనందనుడు = ఇష్టసుతుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను;

భావము:

ఇలా అని పిమ్మట హిరణ్యకశిపుడు “కుమారా! గురువులు చెప్పిన వాటిలో నీకు బాగా నచ్చిన వాటిలో బాగా వచ్చినది చెప్పు.” అన్నాడు. తండ్రి హిరణ్యకశిపుడి మాటలు వినిన చిన్నారి కొడుకు ఇలా అన్నాడు.