పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-135-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గిది వారు చెప్పిన
నా గిదిం జదువుఁ గాని ట్టిట్టని యా
క్షేపింపఁడు తా నన్నియు
రూపించిన మిథ్య లని నిరూఢమనీషన్.

టీకా:

ఏ = ఏ; పగిదిన్ = విధముగ; వారున్ = వారు; చెప్పినన్ = చెప్పిరో; ఆ = ఆ; పగిదిన్ = విధముగనే; చదువున్ = పఠించున్; కాని = కాని; అట్టిట్టు = అలాకాదు ఇలాకాదు; అని = అని; ఆక్షేపింపడు = అడ్డుచెప్పడు, వెక్కిరించడు; తాను = తను; అన్నియున్ = సర్వమును; రూపించిన = నిరూపించినట్టి; మిథ్యలు = అసత్యములు; అని = అని; నిరూఢ = దృఢమైన; మనీషన్ = ప్రజ్ఞతో.

భావము:

ప్రహ్లాదుడు వారు చెప్పినవి అన్నీ చక్కగా తాను విచారించి అనిత్యాలని తెలుసుకున్న వాడు అయినా, వారు చెప్పినట్లు విని చదివేవాడు తప్ప, అలా కాదని తప్పుపట్టేవాడు కాదు, గురువులకు ఎదురు చెప్పి ఆక్షేపించేవాడు కాదు.