పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-133-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని పలికి వారలకుం బ్రహ్లాదు నప్పగించి "తోడ్కొని పొం" డనిన వారును దనుజరాజకుమారునిం గొనిపోయి యతనికి సవయస్కులగు సహశ్రోతల నసురకుమారులం గొందఱం గూర్చి.

టీకా:

అని = అని; పలికి = చెప్పి; వారల్ = వారి; కున్ = కి; ప్రహ్లాదున్ = ప్రహ్లాదుని; అప్పగించి = అప్పచెప్పి; తోడ్కొని = కూడతీసుకొని; పొండు = వెళ్ళండి; అనినన్ = అనగా; వారును = వారు; దనుజరాజకుమారునినన్ = ప్రహ్లాదుని {దనుజరాజకుమారుడు - దనుజు (రాక్షసు)ల రాజ (రాజు యొక్క) కుమారుడు (పుత్రుడు), ప్రహ్లాదుడు}; కొని = తీసుకొని; పోయి = వెళ్ళి; అతని = అతని; కిన్ = కి; స = సమానమైన; వయస్కులు = వయస్సు గలవారు; అగున్ = అయిన; సహ = కూడ, కలిసి; శ్రోతలన్ = పఠించువారు {శ్రోతలు - (చదువులను) వినెడివారు, చదువుకొనువారు}; అసుర = రాక్షస వంశపు; కుమారులన్ = పిల్లలను; కొందఱన్ = కొంతమందిని; కూర్చి = జతచేసి.

భావము:

అలా పలికి వారికి ప్రహ్లాదుడిని అప్పగించి “మీ కూడా తీసుకు వెళ్లం” డని చెప్పాడు. వారు ఆ హిరణ్యకశిపుడి కొడుకును తీసుకు వెళ్లి అతని సమవయస్కులు అయిన సహాధ్యాయులను రాక్షసుల పిల్లలను కొంత మందిని సమకూర్చారు.