పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-132-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"అంప్రక్రియ నున్నవాఁడు, పలుకం స్మత్ప్రతాపక్రియా
గంధం బించుక లేదు, మీరు గురువుల్ కారుణ్యచిత్తుల్ మనో
బంధుల్ మాన్యులు మాకుఁ బెద్దలు, మముం బాటించి యీబాలకున్
గ్రంథంబుల్ చదివించి నీతికుశలుం గావించి రక్షింపరే."

టీకా:

అంధ = గుడ్డివాని; ప్రక్రియన్ = వలె; ఉన్నవాడు = ఉన్నాడు; పలుకండు = స్తుతింపడు; అస్మత్ = నా యొక్క; ప్రతాప = పరాక్రమపు; క్రియా = కార్యముల యొక్క; గంధంబున్ = అగరు, వాసన; ఇంచుకన్ = కొంచెము కూడ; లేదు = లేదు; మీరు = మీరు; గురువుల్ = గురువులు; కారుణ్య = దయ గల; చిత్తుల్ = మనసు గలవారు; మనః = మానసికముగా; బంధుల్ = బంధువులు; మాన్యులు = మన్నింపదగినవారు; మా = మా; కున్ = కు; పెద్దలు = గౌరవించదగినవారు; మమున్ = మమ్ములను; పాటించి = అనుగ్రహించి; ఈ = ఈ; బాలకున్ = పిల్లవానిని; గ్రంథంబుల్ = మంచి పుస్తకములను; చదివించి = చదివించి; నీతి = నీతిశాస్త్రమునందు; కుశలున్ = నేర్పు గలవానినిగా; కావించి = చేసి; రక్షింపరే = కాపాడండి.

భావము:

“అయ్యా! మా అబ్బాయి అజ్ఞానంతో అంధుడిలా ఉన్నాడు. ఏదడిగినా పలుకడు. నా పరాక్రమాలు, ఘనకార్యాలు వాసన మాత్రంగా నైనా వీనికి రాలేదు. మీరు మాకు అన్ని విధాల గురువులు, పెద్దలు, పూజ్యులు. మీరు దయామయ స్వభావము గలవారు, ఆత్మ బంధువులు. మ మ్మనుగ్రహంచి యీ చిన్నవాడికి చదువు చెప్పి పండితుడిని చేసి నన్ను కృతార్థుడిని చేయండి.” అని హిరణ్యకశిపుడు చదువు చెప్పే బాధ్యత అప్పజెప్పాడు.