పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-130-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"చదువనివాఁ డజ్ఞుం డగు
దివిన సదసద్వివేక తురత గలుగుం
దువఁగ వలయును జనులకుఁ
దివించెద నార్యులొద్ధఁ దువుము తండ్రీ!"

టీకా:

చదువని = విద్య నేర్వని; వాడు = వాడు; అజ్ఞుండు = జ్ఞానము లేనివాడు; అగున్ = అగును; చదివినన్ = విద్యనేర్చినచో; సత్ = మంచి; అసత్ = చెడుల; వివేక = విచక్షణ యందు; చతురత = నేర్పు; కలుగున్ = కలుగును; చదువగవలయునున్ = విద్య నేర్చితీరవలెను; జనుల = ప్రజల; కున్ = కు; చదివించెదన్ = విద్య నేర్పించెదను; ఆర్యులు = జ్ఞానుల; ఒద్దన్ = వద్ద; చదువుము = విద్యలు చదువుకొనుము; తండ్రీ = నాయనా.

భావము:

ఒకనాడు హిరణ్యకశిపుడు ముద్దుల కొడుకు ప్రహ్లాదుని పిలిచి
“బాబూ! చదువుకోని వాడు అజ్ఞానిగా ఉండిపోతాడు. చదువుకుంటే మంచిచెడు తెలుస్తుంది వివేకం కలుగుతుంది. మనిషి అన్నవాడు తప్పకుండ చదువుకోవాలి. కనుక నిన్ను మంచిగురువుల దగ్గర చదివిస్తాను. చక్కగా చదువుకో నాయనా!.”