పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-129-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"భ్యం బైన సురాధిరాజపదమున్ క్షింపఁ డశ్రాంతమున్
భ్యత్వంబున నున్నవాఁ డబలుఁడై జాడ్యంబుతో వీఁడు వి
ద్యాభ్యాసంబునఁ గాని తీవ్రమతి గాఁ డంచున్ విచారించి దై
త్యేభ్యుం డొక్క దినంబునం బ్రియసుతున్ వీక్షించి సోత్కంఠుఁడై.

టీకా:

లభ్యంబున్ = పొందదగినది; ఐన = అయిన; సురాధిరాజ = దేవేంద్రుని; పదమున్ = అధికారమును కూడ; లక్షింపడు = లెక్కచేయడు; అశ్రాంతమున్ = ఎల్లప్పుడును; సభ్యత్వంబునన్ = సాధుస్వభావముతో; ఉన్న = ఉన్నట్టి; వాడు = వాడు; అబలుడు = బలము లేనివాడు; ఐ = అయ్యి; జాడ్యంబు = మందత్వము; తోన్ = తోటి; వీడు = ఇతడు; విద్య = చదువు; అభ్యాసంబునన్ = చెప్పబడుటచే; కాని = కాని; తీవ్ర = చురుకైన; మతి = బుద్ధి గలవాడు; కాడు = అవ్వడు; అంచున్ = అనుచు; విచారించి = భావించి; దైత్యేభ్యుండు = హిరణ్యకశిపుడు {దైత్యేభ్యుడు - దైత్య (రాక్షసు)లను ఇభ్యుడు (పాలించువాడు), హిరణ్యకశిపుడు}; ఒక్క = ఒక; దినంబునన్ = రోజు; ప్రియసుతున్ = ముద్దుల కొడుకును; వీక్షించి = చూసి; సోత్కంఠుడు = ఉత్కంఠ గలవాడు; ఐ = అయ్యి.

భావము:

“హిరణ్యకశిపుడు తన కొడుకు నడవడి చూసి “వీడు దేవేంద్ర పదవి దొరికినా లెక్కచేయడు. ఎప్పుడు చూసినా సోమరిలా అవివేకంతో తిరుగుతున్నాడు. బలహీను డయి జాడ్యంతో చెడిపోవుచున్నాడు. వీడిని చదువులు చదివిస్తే కాని చురుకైనవాడు కా” డని తలచి, ఒకరోజు కొడుకును చూసి ఉత్కంఠ కలవాడై.