పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-126-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"పుత్రుల్ నేర్చిన నేరకున్న జనకుల్ పోషింతు రెల్లప్పుడున్
మిత్రత్త్వంబున బుద్ధి చెప్పి దురితోన్మేషంబు వారింతు రే
త్రుత్వంబుఁ దలంప రెట్టియెడ నా సౌజన్యరత్నాకరుం
బుత్రున్ లోకపవిత్రుఁ దండ్రి నెగులుం బొందింప నెట్లోర్చెనో?

టీకా:

పుత్రుల్ = కొడుకులు; నేర్చినన్ = నేర్చుకొన్నను; నేరకున్నన్ = నేర్చుకొనకపోయినను; జనకుల్ = తండ్రులు; పోషింతురు = పోషించెదరు; ఎల్లప్పుడున్ = ఎప్పుడైనను; మిత్రత్వంబునన్ = చనువుతో; బుద్ధి = మంచిబుద్ధులు; చెప్పి = చెప్పి; దురిత = పాపములు; ఉన్మేషంబునన్ = అభివృద్ధి అగుటను; వారింతురు = అడ్డుకొనెదరు; ఏ = ఎటువంటి; శత్రుత్వంబున్ = విరోధమును; తలపరున్ = తలపెట్టరు; ఎట్టి = ఎటువంటి; ఎడన్ = పరిస్థితులలోను; సౌజన్య = మంచివారిలక్షణములకు; రత్నాకరున్ = సముద్రమువంటివానిని; పుత్రున్ = కుమారుని; లోక = సర్వలోకములను; పవిత్రున్ = పావనముచేసెడివానిని; తండ్రి = తండ్రి; నెగులున్ = కష్టములను; పొందింపన్ = పెట్టించుటకు; ఎట్లు = ఏవిధముగ; ఓర్చెనో = ఓర్చుకొనగలిగెనో కదా.

భావము:

“నారదమహర్షీ! లోకంలో తల్లిదండ్రులు కొడుకులు తెలిసినవాళ్ళైనా తెలియనివాళ్ళైనా రక్షిస్తూ ఉంటారు. తెలియకపోతే బుద్ధిచెప్పి సరిదిద్దుతారు. ఎప్పుడు పిల్లలను ప్రేమతో పెంచుతారు. అంతేగాని శత్రుత్వము చూపించరు కదా. ఇలా ఎక్కడా జరగదు వినం కూడా. అలాంటిది బహు సౌమ్యుడు లోకాన్ని పావనం చేసేవాడు అయిన కొడుకును ఏ తండ్రి మాత్రం బాధిస్తాడు? అలాంటి వాడిని హింసించటానికి వాడికి మనసెలా ఒప్పింది.