పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-124.1-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

లుకు నొక్కచోటఁ రమేశుఁ గేశవుఁ
బ్రణయహర్ష జనిత బాష్పసలిల
మిళితపులకుఁ డై నిమీలితనేత్రుఁ డై
యొక్కచోట నిలిచి యూరకుండు.

టీకా:

వైకుంఠ = నారాయణుని; చింతా = ధ్యానముచేత; వివర్జిత = వదలివేసిన; చేష్టుడు = వ్యాపారములు గలవాడు; ఒక్కడున్ = ఒంటరిగా; ఏడుచున్ = విలపించును; ఒక్కచోట = ఒకమాటు; అశ్రాంత = ఎడతెగని; హరి = నారాయణుని; భావనా = ధ్యానము నందు; ఆరూఢ = నిలుపబడిన; చిత్తుడు = మనసు గలవాడు; ఐ = అయ్యి; ఉద్ధతుడు = లగ్నమైనవాడు; ఐ = అయ్యి; పాడున్ = పాడును; ఒక్కచోట = ఒకమాటు; విష్ణుడు = విష్ణుమూర్తే; ఇంతియకాని = ఇంతేకాని, ఇతను తప్పించి; వేఱొండు = మరితరమైనది; లేదు = ఏమియు లేదు; అని = అని; ఒత్తిలి = గట్టిగా; నగుచున్ = నవ్వుతూ; ఉండున్ = ఉండును; ఒక్కచోట = ఒకమాటు; నళినాక్షుడు = హరి {నళినాక్షుడు - నళినము (పద్మము) వంటి అక్షుడు (కన్నులుగలవాడు), విష్ణువు}; అను = అనెడి; నిధానమున్ = నిధిని; కంటిన్ = కనుగొంటిని; నేను = నేను; అని = అని; ఉబ్బి = పొంగిపోయి; గంతులు = ఉత్సాహముతో ఉరకలు; వైచున్ = వేయును; ఒక్కచోట = ఒకమాటు; పలుకున్ = మాట్లాడుచుండును; ఒక్కచోట = ఒకమాటు; పరమేశున్ = నారాయణుని; కేశవున్ = నారాయణుని; ప్రణయ = మిక్కిలి భక్తిచే గలిగిన; హర్ష = సంతోషమువలన; జనిత = పుట్టిన; సలిల = కన్నీటితో; మిళిత = కలగలిసిన; పులకుడు = గగుర్పాటు గలవాడు; ఐ = అయ్య.
నిమీలిత = మూసిన; నేత్రుడు = కన్నులు గలవాడు; ఐ = అయ్యి; ఒక్కచోట = ఒక ప్రదేశములో; నిలిచి = ఆగిపోయి; ఊరక = ఉత్తినే; ఉండున్ = ఉండును.

భావము:

ధర్మరాజా! ప్రహ్లాదుడు ఒక్కొక్కసారి హరిస్మరణలో మునిగి మైమరచిపోయి "విష్ణుధ్యానములో విరామం కలిగిం" దని ఒంటరిగా కూర్చుని ఏడుస్తూ ఉంటాడు; ఒక్కక్క చోట విష్ణువు మీద మనసు నిలిపి, ఆనందం అతిశయించగా గొంతెత్తి గానం చేస్తూ ఉంటాడు; ఒక్కోసారి "విష్ణువు తప్ప ఇతరం ఏమీ లేదు లే" దని గట్టిగా అంటూ పకపక నవ్వుతూ ఉంటాడు; ఒక్కోచోట "నలినాక్షుడు (విష్ణువు) అనే పెన్నిధి కన్నులారా కన్నా" అంటూ గంతులేస్తాడు; ఇంకోచోట భక్తిపారవశ్యంతో ఆనందభాష్పాలు రాలుస్తూ "పరమేశ్వరా! కేశవా!" అని పిలుస్తూ ఉంటాడు; మరింకోచోట భక్తి తాత్పర్యాదులతో ఒడలు గగుర్పొడుస్తుండగా కనులు మూసికొని నిర్లిప్తంగా ఉంటాడు.