పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-122.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిపదాంభోజయుగ చింతనామృతమున
నంతరంగంబు నిండినట్లైన, నతఁడు
నిత్య పరిపూర్ణుఁ డగుచు నన్నియును మఱచి
డత లేకయు నుండును డుని భంగి.

టీకా:

శ్రీవల్లభుడు = హరి {శ్రీవల్లభుడు - శ్రీ (లక్ష్మీదేవి) యొక్క వల్లభుడు (భర్త), విష్ణువు}; తన్నున్ = తనను; చేరిన = వద్దకు వచ్చిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; చెలికాండ్రన్ = స్నేహితులను; ఎవ్వరిన్ = ఎవరినికూడ; చేరన్ = కలియుటను; మఱచున్ = మరచిపోవును; అసురారి = హరి {అసురారి - అసుర (రాక్షసుల) అరి (శత్రువు), విష్ణువు}; తన = తన యొక్క; మ్రోలన్ = ఎదుట; ఆడిన = మెలగిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అసుర = రాక్షస; బాలుర = పిల్లలు; తోడన్ = తోటి; ఆడన్ = క్రీడించుట; మఱచున్ = మరచిపోవును; భక్తవత్సలుడు = హరి {భక్తవత్సలుడు - భక్తుల యెడల వాత్సల్యము గలవాడు, విష్ణువు}; సంభాషించిన = మాట్లాడిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; పర = ఇతరమైన; భాషల్ = మాటల; కున్ = కు; మాఱు = బదులు; పలుకన్ = చెప్పుట; మఱచున్ = మరచిపోవును; సురవంద్యున్ = హరిని {సురవంద్యుడు - సుర (దేవతలచే) వంద్యుడు (మొక్కబడినవాడు), విష్ణువు}; తన = తన; లోనన్ = అందు; చూచిన = కాంచిన; అట్లు = విధముగా; ఐనన్ = అయినచో; చొక్కి = సోలిపోయి; సమస్తంబున్ = అఖిలమును; చూడన్ = చూచుట; మఱచున్ = మరచిపోవును.
హరి = హరి; పద = పాదములు యనెడి; అంభోజ = పద్మముల; యుగ = జంటను; చింతన = స్మరించుట యనెడి; అమృతమున్ = అమృతముతో; అంతరంగంబు = హృదయము; నిండిన = నిండిపోయిన; అట్లు = అట్లు; ఐనన్ = అయినచో; అతడు = అతడు; నిత్య = నిత్య; పరిపూర్ణుడు = సంతృప్తి చెందినవాడు; అగుచన్ = అగుచు; అన్నియున్ = సర్వమును; మఱచి = మరచిపోయి; జడత = చేష్ట లుడుగుట; లేకయున్ = లేకుండగ; ఉండును = ఉండును; జడుని = వెఱ్ఱివాని; భంగిన్ = వలె.

భావము:

మహారాజా! ఆ ప్రహ్లాదుడు విష్ణువు తనను చెంది ఉన్నప్పుడు స్నేహితులతో చేరడు. శ్రీహరి తన ఎదురుగా మెదలుతూ ఉన్నప్పుడు తోటి రాక్షసుల పిల్లలతో ఆటలాడడు. ఆయన తనతో మాట్లాడుతున్నప్పుడు ఇతరులతో మాట్లాడడు. ఆయనను తనలో ధ్యానించుకునే సమయంలో మరింక దేనిని చూడడు. హరిధ్యానముతో మనసు నిండి ఉన్నప్పుడు అతడు ఆనందపూర్ణుడై అన్ని వదిలేసి, మోహము లేకపోయినా, పిచ్చివాడి లాగ కనబడతాడు.