పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-121-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఇట్లు సద్గుణగరిష్ఠుం డయిన ప్రహ్లాదుండు భగవంతుం డయిన వాసుదేవుని యందు సహజ సంవర్ధమాన నిరంతర ధ్యానరతుండై.

టీకా:

ఇట్లు = ఈ విధముగ; సద్గణ = సుగుణములచే; గరిష్ఠుండు = గొప్పవాడు; అయిన = ఐన; ప్రహ్లాదుండు = ప్రహ్లాదుడు; భగవంతుండు = మహిమాన్వితుండు; అయిన = ఐన; వాసుదేవుని = నారాయణుని {వాసుదేవుని - సకల ఆత్మ లందు వసించు వాడు, విష్ణువు}; అందున్ = ఎడల; సహజ = తనంతతనే; సంవర్ధమాన = చక్కగా పెరిగిన; నిరంతర = ఎడతెగని; ధ్యాన = ధ్యానము నందు; రతుండు = తగిలినవాడు; ఐ = అయ్యి.

భావము:

ఇలా గొప్ప సద్గుణాలు కల ప్రహ్లాదుడు ఎప్పుడు సహజసిద్ధంగా భక్తితో భగవంతుడూ, ఆత్మలో వసించేవాడూ అయిన విష్ణుని ధ్యానిస్తూ ఆనందిస్తూ ఉండేవాడు. అతని హరి భక్తి నానాటికి అతిశయిస్తూ ఉండేది.