పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-120-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గునిధి యగు ప్రహ్లాదుని
గుము లనేకములు గలవు గురుకాలమునన్
ణుతింప నశక్యంబులు
ణిపతికి బృహస్పతికిని భాషాపతికిన్.

టీకా:

గుణ = సుగుణములకు; నిధి = నిక్షేపము వంటివాడు; అగు = అయిన; ప్రహ్లాదునిన్ = ప్రహ్లాదుని; గుణముల్ = సుగుణములు; అనేకములు = చాలా ఎక్కువ; కలవు = ఉన్నవి; గురు = పెద్ద; కాలమునన్ = కాలములోనైనను; గణుతింపన్ = వర్ణించుటకు; అశక్యంబులు = సాధ్యములుకావు; ఫణిపతి = ఆదిశేషుని {ఫణిపతి - ఫణి (సర్పములకు) పతి (రాజు), ఆదిశేషుడు}; కిన్ = కి; బృహస్పతి = బృహస్పతి; కిని = కిని; భాషాపతి = బ్రహ్మదేవుని {భాషాపతి - భాషా (భాషకి దేవత సరస్వతి) యొక్క పతి (భర్త), బ్రహ్మ}; కిన్ = కి.

భావము:

ఆ సుగుణాలగని అయిన ప్రహ్లాదుడి గుణములు వివరించి చెప్ప నలవికాదు. అతని అనంత సుగుణాలను ఎన్నాళ్ళు వర్ణించినా ఆదిశేషుడు, బృహస్పతి, బ్రహ్మ మొదలగువారు కూడ వర్ణించలేరు.