పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాద చరిత్రము

  •  
  •  
  •  

7-115-సీ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

న యందు నఖిల భూము లందు నొకభంగి-
మహితత్వంబున రుగువాఁడు;
పెద్దలఁ బొడగన్న భృత్యునికైవడిఁ-
 > జేరి నమస్కృతుల్ చేయువాఁడు;
న్నుదోయికి నన్యకాంత లడ్డం బైన-
మాతృభావము జేసి రలువాఁడు;
ల్లిదండ్రుల భంగి ర్మవత్సలతను-
దీనులఁ గావఁ జింతించువాఁడు;

7-115.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖుల యెడ సోదరస్థితి రుపువాఁడు;
దైవతము లంచు గురువులఁ లఁచువాఁడు
లీల లందును బొంకులు లేనివాఁడు;
లితమర్యాదుఁ డైన ప్రహ్లాదుఁ డధిప!

టీకా:

తన = తన; అందున్ = ఎడల; అఖిల = ఎల్ల; భూతముల్ = ప్రాణుల; అందున్ = ఎడల; ఒక = ఒకే; భంగిన్ = విధముగ; సమహిత = సమత్వ; తత్వంబునన్ = భావముతో; జరుగు = మెలగు; వాడు = వాడు; పెద్దలన్ = పెద్దలను; పొడగన్న = గమనించినచో; భృత్యుని = సేవకుని; కైవడి = వలె; చేరి = దగ్గరకు వెళ్ళి; నమస్కృతుల్ = నమస్కారములు; చేయు = చేసెడి; వాడు = వాడు; కన్నుదోయి = రెండుకళ్ళ; కిన్ = కి; అన్య = ఇతర; కాంతలు = స్త్రీలు; అడ్డంబు = ఎదురుపడుట; ఐన = జరిగిన; మాతృ = తల్లి యనెడి; భావము = భావము; చేసి = వలన; మరలు = మెలిగెడి; వాడు = వాడు; తల్లిదండ్రుల = తల్లిదండ్రుల; భంగిన్ = వలె; ధర్మవత్సలతన్ = న్యాయబుద్ధితో; దీనులన్ = బీదలను; కావన్ = కాపాడుటకు; చింతించు = భావించు; వాడు = వాడు.
సఖుల = స్నేహితుల; యెడ = అందు; సోదర = తోడబుట్టినవాడి; స్థితిన్ = వలె; జరుపు = నడపు; వాడు = వాడు; దైవతములు = దేవుళ్ళు; అంచున్ = అనుచు; గురువులన్ = గురువులను; తలచు = భావించెడి; వాడు = వాడు; లీలలు = ఆటలు; అందును = లోనయినను; బొంకులు = అబద్ధములు; లేని = చెప్పనేచెప్పని; వాడు = వాడు; లలిత = చక్కటి; మర్యాదుడు = మర్యాద గలవాడు; ఐన = అయిన; ప్రహ్లాదుడు = ప్రహ్లాదుడు; అధిప = రాజా.

భావము:

ఓ ధర్మరాజా! ఆ నలుగురిలో చక్కటి వివేకము కలిగిన వాడూ; సకల ప్రాణులను తనతో సమానులుగా చూచు వాడూ; సజ్జనులు కనబడితే సేవకుడిలా దగ్గరకెళ్ళి మ్రొక్కు వాడూ; పరస్త్రీలు కనబడితే తల్లిలా భావించి ప్రక్కకు తప్పుకొను వాడూ; దిక్కులేని వారిని చూస్తే వారిని సొంత బిడ్డలలా కాపాడు వాడూ; మిత్రులతో అన్నదమ్ములులా మెలగు వాడూ; దేవుళ్ళు అంటూ గురువులను భావించే వాడూ; ఆటలలో కూడా అబద్దాలు ఆడని వాడూ; చక్కటి మర్యాద గల వాడూ ప్రహ్లాదుడు అను కొడుకు.