పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-5-శా.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

"నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర! ల
క్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబు లై
శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబు లై.

టీకా:

నీ = నీ యొక్క; సంప్రశ్నము = చక్కటి యడుగుట; వర్ణనీయము = మెచ్చుకోదగినది; కదా = కదా; నిక్కంబు = నిజమే; రాజ = రాజులలో; ఇంద్ర = ఉత్తముడ; లక్ష్మీసంభావ్యుని = నారాయణుని {లక్ష్మీసంభావ్యుడు - లక్ష్మీదేవి చేత సంభావ్యుడు (సేవింప దగినవాడు), విష్ణువు}; సత్ = చక్కటి; చరిత్రము = వర్తనము; మహా = మిక్కిలి; చిత్రంబు = అద్భుతమైనది; చింతింపన్ = తరచి చూసిన; తత్ = అతని; దాస = భక్తుల; ఆఖ్యానములు = కథలు; ఒప్పున్ = చక్కగ కలిగి యుండును; విష్ణు = నారాయణుని; చరణ = పాదముల; ధ్యాన = చింతనములే; ప్రధానంబులు = ముఖ్యాంశములుగ గలవి; ఐ = అయ్యి; శ్రీ = శుభములను; సంధానములు = కూర్చునవి; ఐ = అయ్యి; ముని = మునులలో; ఈశ్వర = అత్యుత్తముల; వచస్ = పలుకులచే; జేగీయమానంబులు = స్తుతింపబడెడివి; ఐ = అయ్యి.

భావము:

“ఓ పరీక్షిత్తు మహారాజా! నువ్వు నిజంగా చాలా చక్కటి ప్రశ్న అడిగావు. లక్ష్మీదేవి చేత కూడా సేవించబడే ఆ శ్రీ మహావిష్ణువు కథలు చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. విచారించి చూస్తే ఆయన భక్తుల కథలు కూడా అలాంటివే. అవి విష్ణుపాదభక్తిప్రపత్తులను కలిగించేవి; శ్రేయస్కరములైనవి; మహా మునులచేత కీర్తింపబడేవి;