పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-12-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిసాధింతు హరిన్ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా
రికిన్ వైరి నటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడుం
దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో
కప్రాప్తియు నొందఁ, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?

టీకా:

హరిన్ = శ్రీకృష్ణుని; సాధింతున్ = ఓడించెదను; హరిన్ = శ్రీకృష్ణుని; గ్రసింతున్ = మింగెదను; హరిన్ = శ్రీకృష్ణుని; ప్రాణాంతంబున్ = మరణమునకు; ఒందింతున్ = చెందించెదను; తాన్ = తను; హరి = శ్రీకృష్ణుని; కిన్ = కి; వైరిన్ = శత్రువును; అట = అని; అంచున్ = అనుచు; వీడు = ఇతడు; పటు = దట్టమైన; రోష = కోపము; ఆయత్తుడు = కలవాడు; ఐ = అయ్యి; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తిరుగున్ = వర్తించును; ప్రువ్వదు = పుచ్చిపోదు; నోరు = నోరు; వ్రీలి = విరిగి; పడదు = కూలిపోదు; ఆ = ఆ; దేహంబున్ = శరీరము; దాహంబు = యాతనల; తోన్ = తోటి; నరక = నరకమును; ప్రాప్తియున్ = చెందుటను; ఒందడు = పొందడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; జగన్నాథున్ = విష్ణువు నందు {జగన్నాథుడు - జగత్తునకు నాథుడు, విష్ణువు}; ప్రవేశించెనో = చేరెనో.

భావము:

ఈ శిశుపాలుడు ఎప్పుడూ రోషంతో, ద్వేషంతో తిరుగుతుండేవాడు; ఎప్పుడూ “కృష్ణుణ్ణి ఓడిస్తా, పట్టుకుంటా, చంపేస్తా, కృష్ణుడు నా ప్రాణ విరోధి” అంటూ ఉండే వాడు కదా! పుణ్యపురుషుని దూషించే వీడికి పురుగులు పట్టి నోరు ఎందుకు పుచ్చిపోలేదు; శరీరావయవాలు విరిగి పడిపోలేదు; దేహం దహించి నరకంలో పడిపోలేదు; పైగా ఎలా సర్వలోకాధి నాయకుడైన శ్రీహరిలో ప్రవేశించింది;