పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

  •  
  •  
  •  

7-11-ఉ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో
లీనుఁడు గాఁడె తొల్లి; మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాట నుం
డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టి వాఁ
డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?

టీకా:

వేనుడు = వేను డనెడి మహారాజు {వేనుడు - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కుమారుడు}; మాధవున్ = విష్ణుమూర్తిని; తెగడి = నిందించి; విప్రులు = బ్రాహ్మణులు; తిట్టినన్ = శపించగా; భగ్నుడు = నశించినవాడు; ఐ = అయ్యి; తమస్ = చీకటిలోకమున, నరకమున; లీనుండు = కలిసినవాడు; కాడె = కాలేదా ఏమి, అయ్యెనుకదా; తొల్లి = పూర్వకాల మందు; మద = పొగరు; లిప్తుడు = పట్టినవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు -చేదిదేశపురాజు,శిశుపాలుడు}; పిన్ననాట = చిన్నతనము; నుండేనియున్ = నుండియును; మాధవున్ = శ్రీకృష్ణుని; వినన్ = వినుటనుకూడ; సహింపడు = ఓర్వడు; భక్తిన్ = భక్తిని; వహింపడు = కలిగి యుండడు; అట్టి = అటువంటి; వాడు = అతడు; ఏ = ఎట్టి; నిబిడ = దట్టమైన; ప్రభావమునన్ = మహిమవలన; ఈ = ఈ; పరమేశ్వరున్ = భగవంతుని; అందున్ = లో; చొచ్చెనో = లీనమయ్యెనో.

భావము:

పూర్వం వేనుడనే రాజు విష్ణుమూర్తిని దూషించగా, వేదమూర్తులు అయిన బ్రాహ్మణులు శపించారు; అతను అలా నరకంలో పడిపోయాడు కదా! ఈ పొగరుబోతు చేది దేశపు శిశుపాలునికి భక్తి ఎలాగూ లేదు; పైగా చిన్నప్పటి నుండి కృష్ణుడి మాటంటేనే మండిపడేవాడు కదా! అటువంటి వాడు ఇలా ఏ మహా మహిమతో కృష్ణమూర్తిలో లీనం అయ్యాడు?