పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారాయణుని వైషమ్య అభావం

 •  
 •  
 •  

7-3-సీ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ర్వభూతములకు ముఁడు నెచ్చెలి ప్రియుం-
డైన వైకుంఠుఁ డనంతుఁ డాద్యుఁ
డింద్రుని కొఱకు దైత్యేంద్రుల నేటికి-
విషముని కైవడి వెదకి చంపె?
సురులఁ జంపంగ మరులచేఁ దన,-
య్యెడి లాభ మింతైనఁ గలదె?
నిర్వాణనాథుండు నిర్గుణుం డగు తన,-
సురుల వలని భయంబుఁ బగయుఁ

7-3.1-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుగనేర వట్టి నుఁడు దైత్యులఁ జంపి
సురులఁ గాచుచునికి చోద్య మనుచు
సంశయంబు నాకు నియించె మునినాథ!
ప్రజ్ఞమెఱసి తెలియఁ లుకవయ్య!"

టీకా:

సర్వ = అఖిల; భూతముల్ = జీవుల; కున్ = కు; సముడు = అంగీకారమైనవాడు; నెఱ = ముఖ్య; చెలి = స్నేహితుడు; ప్రియుండు = ఇష్టుడు; ఐన = అయిన; వైకుంఠుడు = నారాయణుడు {వైకుంఠుడు - వైకుంఠముననుండు వాడు, విష్ణువు}; అనంతుడు = నారాయణుడు {అనంతుడు - అంతము లేని వాడు, విష్ణువు}; ఆద్యుడు = నారాయణుడు {ఆద్యుడు - సృష్టి యాదినుండి యున్నవాడు, విష్ణువు}; ఇంద్రుని = దేవేంద్రుని; కొఱకున్ = కోసము; దైత్య = రాక్షసుల {దైత్యులు - దిత్ యొక్క పుత్రులు}; ఇంద్రులన్ = నాయకులను; ఏటికి = ఎందులకు; విషముని = శత్రుని {విషముని - రాగద్వేషాదిగుణములచే విషమమైన బుద్ధి కలవాడు}; కైవడి = వలె; వెదకి = వెతికి; చంపెన్ = సంహరించెను; అసురులన్ = రాక్షసులను {అసురులు - సురులు (దేవతలు) కానివారు, రాక్షసులు}; చంపగన్ = చంపుటవలన; అమరుల్ = దేవతలు {అమరులు - మరణములేనివారు, దేవతలు}; చేన్ = వలన; తన = తన; కున్ = కు; అయ్యెడి = కలిగెడి; లాభము = ప్రయోజనము; ఇంత = కొంచెము; ఐన = అయినను; కలదె = ఉన్నదా ఏమి, లేదు; నిర్వాణ = మొక్షమునకు; నాథుండు = ప్రభువు; నిర్గుణుండు = గుణరహితుడు; అగు = అయినట్టి; తన = తన; కిన్ = కి; అసురుల = రాక్షసుల; వలని = మూలమున; భయంబున్ = భయముకాని; పగయున్ = పగకాని; కలుగన్ = కలుగుటలు; నేరవు = సమర్థములుగావు; అట్టి = అటువంటి.
ఘనుడు = గొప్పవాడు; దైత్యులన్ = రాక్షసులను; చంపి = సంహరించి; సురులన్ = దేవతలను; కాచుచుని = కాపాడుట; కిన్ = కు; చోద్యము = ఆశ్చర్యకరము; అనుచున్ = అని; సంశయంబు = అనుమానము; నా = నా; కున్ = కు; జనియించెన్ = కలిగెను; ముని = మునియైనట్టి; నాథ = ప్రభువ; ప్రజ్ఞ = బుద్ధి; మెఱసి = అతిశయించగ; తెలియన్ = తెలియునట్లు; పలుకవు = చెప్పుము; అయ్య = తండ్రి.

భావము:

“ఓ మునీశ్వరా! శుకమహర్షి! విష్ణుమూర్తి జీవులు అన్నిటి అందు సమానుడు, మిత్రుడు, బంధువు కదా. అలాంటప్పుడు, విష్ణువు ఇంద్రుడి కోసం రాక్షసులను అందరిని మోసగాడిలా ఎందుకు వెతికి మరీ చంపాడు? రాక్షసులను చంపి, దేవతలను కాపాడితే తనకి ఏమిటి లాభం? జీవులందరికి ముక్తిని ఇచ్చే విష్ణువునకు రాక్షసుల వలన భయం కాని, విరోధం కాని కలుగుతుందా? లేదు కదా! మరి, మమకారం కలవాడిలా రాక్షసులను చంపటం, దేవతలను రక్షించటం అది చూస్తుంటే చిత్రంగా ఉంది. దీని వలన నాకు సందేహం కలుగుతోంది. నీకు తెలిసినది అంతా నాకు తెలియజెప్పు, తండ్రీ!”

7-4-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అనిన శుకుం డిట్లనియె.

టీకా:

అనినన్ = అనిపలుకగా; శుకుండు = శుకుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇలా అడిగిన పరీక్షిత్తునితో శుకబ్రహ్మ ఇలా అన్నాడు

7-5-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"నీ సంప్రశ్నము వర్ణనీయము గదా నిక్కంబు రాజేంద్ర! ల
క్ష్మీసంభావ్యుని సచ్చరిత్రము మహాచిత్రంబు చింతింపఁ ద
ద్దాసాఖ్యానము లొప్పు విష్ణుచరణధ్యాన ప్రధానంబు లై
శ్రీ సంధానములై మునీశ్వర వచో జేగీయమానంబు లై.

టీకా:

నీ = నీ యొక్క; సంప్రశ్నము = చక్కటి యడుగుట; వర్ణనీయము = మెచ్చుకోదగినది; కదా = కదా; నిక్కంబు = నిజమే; రాజ = రాజులలో; ఇంద్ర = ఉత్తముడ; లక్ష్మీసంభావ్యుని = నారాయణుని {లక్ష్మీసంభావ్యుడు - లక్ష్మీదేవి చేత సంభావ్యుడు (సేవింప దగినవాడు), విష్ణువు}; సత్ = చక్కటి; చరిత్రము = వర్తనము; మహా = మిక్కిలి; చిత్రంబు = అద్భుతమైనది; చింతింపన్ = తరచి చూసిన; తత్ = అతని; దాస = భక్తుల; ఆఖ్యానములు = కథలు; ఒప్పున్ = చక్కగ కలిగి యుండును; విష్ణు = నారాయణుని; చరణ = పాదముల; ధ్యాన = చింతనములే; ప్రధానంబులు = ముఖ్యాంశములుగ గలవి; ఐ = అయ్యి; శ్రీ = శుభములను; సంధానములు = కూర్చునవి; ఐ = అయ్యి; ముని = మునులలో; ఈశ్వర = అత్యుత్తముల; వచస్ = పలుకులచే; జేగీయమానంబులు = స్తుతింపబడెడివి; ఐ = అయ్యి.

భావము:

“ఓ పరీక్షిత్తు మహారాజా! నువ్వు నిజంగా చాలా చక్కటి ప్రశ్న అడిగావు. లక్ష్మీదేవి చేత కూడా సేవించబడే ఆ శ్రీ మహావిష్ణువు కథలు చాలా ఆశ్చర్యకరంగానే ఉంటాయి. విచారించి చూస్తే ఆయన భక్తుల కథలు కూడా అలాంటివే. అవి విష్ణుపాదభక్తిప్రపత్తులను కలిగించేవి; శ్రేయస్కరములైనవి; మహా మునులచేత కీర్తింపబడేవి;

7-6-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

చిత్రంబులు త్రైలోక్య ప
విత్రంబులు భవలతా లవిత్రంబులు స
న్మిత్రంబులు మునిజన వన
చైత్రంబులు విష్ణుదేవు చారిత్రంబుల్.

టీకా:

చిత్రంబులు = మనోజ్ఞమైనవి {చిత్రము - చిత్తమును రమింప జేయునవి, మనోజ్ఞములు}; త్రైలోక్య = ముల్లోకములను {త్రిలోకములు - మూడులోకములు, 1భూలోకము 2ఊర్థ్వలోకములు 3అధోలోకములు}; పవిత్రంబులు = పవిత్రము జేయునవి; భవ = సాంసారపు; లతా = తీగ లనెడి బంధనములను; లవిత్రంబులు = కొడవళ్ళ వలె ఖండించునవి; సత్ = మంచి; మిత్రంబులు = మిత్రుల వంటివి; ముని = మునుల; జన = సమూహము యనెడి; వన = అడవికి; చైత్రంబులు = చైత్రమాసమువలె అలరించునవి; విష్ణు = విష్ణుమూర్తి యనెడి; దేవు = దేవుని యొక్క; చారిత్రంబులు = కథలు.

భావము:

విష్ణుకథలు బహు చిత్రమైనవి. చక్కటి చిత్రాలలా మనసులను రంజింపజేసేవి. ముల్లోకాలకు పవిత్రతను ఇచ్చేవి. కొడవళ్ళు తీగెలను కత్తిరించినంత అవలీలగా సంసార బంధాలను ఛేదించేవి. అఖిల జీవరాశికి ఆప్తమిత్రాలైనవి. వనాలను వసంతాలు వికసింపజేసి నట్లు, మునులను అలరింపజేసేవి.

7-7-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నరేంద్రా! కృష్ణద్వైపాయనునకు నమస్కరించి హరికథనంబులు జెప్పద వినుము; వ్యక్తుండుగాక గుణంబులు లేక ప్రకృతిం జెందక, భవంబుల నొందక, పరమేశ్వరుండు దన మాయవలన నయిన గుణంబుల నావేశించి, బాధ్య బాధకత్వంబుల నొందు; నతండు గుణరహితుండు; సత్త్వ రజ స్తమంబులు ప్రకృతిగుణంబు; లా గుణంబులకు నొక్కొక్క కాలంబున హానివృద్ధులు గల; వా యీశ్వరుండు సత్త్వంబున దేవఋషులను, రజోగుణంబున నసురులను, దమోగుణంబున యక్ష రక్షోగణంబులను, విభజించె; సూర్యుండు పెక్కెడలం గానంబడియు నొక్కరుం డైన తెఱంగునఁ దద్విభుండును సర్వగతుండయ్యును భిన్నుండు గాఁడు; తత్త్వవిదులైన పెద్దలు దమలోనం బరమాత్మ స్వరూపంబున నున్న యీశ్వరు నివ్విధంబున నెఱుంగుదురు; జీవాత్మకుఁ బరుండైన సర్వమయుండు తన మాయచేత రజంబును విశ్వంబు సృజింపం గోరి, సత్త్వంబును గ్రీడింపం గోరి, తమంబును నిద్రింపం గోరి యుత్పాదించి, చరమైన కాలంబును సృజియించు; నా కాలంబున సర్వదర్శనుం డైన యీశ్వరుండును గాలాహ్వయుండును నై హరి సత్త్వగుణం బయిన దేవానీకంబునకు వృద్ధియు, రజ స్తమోగుణు లయిన రాక్షసులకు హానియుం జేయుచుండు.

టీకా:

నరేంద్రా = రాజా {నరేంద్రుడు - నరుల (మానవుల)కు ఇంద్రుడు (ప్రభువు), రాజు}; కృష్ణద్వైపాయనున్ = వేదవ్యాసున; కున్ = కు; నమస్కరించి = నమస్కరించి; హరి = విష్ణు; కథనంబులు = చరిత్రలు; చెప్పెదన్ = చెప్పెదను; వినుము = వినుము; వ్యక్తుండు = కనబడువాడు; కాక = కాకుండగ; గుణంబులు = గుణత్రయములు {గుణత్రయములు - 1సత్త్వగుణము 2రజోగుణము 3తమోగుణము}; లేక = లేకుండగ; ప్రకృతిన్ = మాయకు; చెందక = లోనుగాక; భవంబులన్ = పునర్జన్మంబులు; ఒందక = పొందకుండగ; పరమేశ్వరుండు = భగవంతుడు; తన = తన యొక్క; మాయ = మాయ; వలనన్ = కారణముచేత; అయిన = ఐనట్టి; గుణంబులన్ = గుణత్రయము నందు; ఆవేశించి = చొచ్చి; బాధ్య = బాధింప చేయువాడు; బాధకత్వంబులన్ = బాధింప బడువాడు లగుటను; ఒందున్ = పొందును; అతండు = అతడు; గుణ = గుణములు; రహితుండు = లేనివాడు; సత్త్వరజస్తమంబులు = త్రిగుణములు; ప్రకృతి = స్వభావసిద్ధమైన; గుణంబులు = గుణములు; ఆ = ఆ; గుణంబుల్ = గుణముల; కున్ = కు; ఒక్కొక్క = వేరువేరు; కాలంబునన్ = సమయములలో; హాని = తగ్గుటలు, శాంతించుటలు; వృద్ధులు = పెరుగుటలు, ప్రకోపించుటలు; కలవు = జరుగుచుండును; ఆ = ఆ; ఈశ్వరుండు = భగవంతుడు; సత్త్వంబునన్ = సత్త్వగుణముతో; దేవ = దేవుళ్ళను; ఋషులను = ఋషులను; రజోగుణంబునన్ = రజోగుణముతో; అసురులను = అసురులను; తమోగుణంబునన్ = తమోగుణముతో; యక్ష = యక్షుల; రక్షస్ = రాక్షసుల; గణంబులను = గుణములను; విభజించెన్ = వేరుగ గలిగించెను; సూర్యుండు = సూర్యుడు; పెక్కు = అనేక; ఎడలన్ = ప్రదేశములలో; కానంబడియున్ = కనబడినప్పటికి; ఒక్కరుండు = ఒకడే; ఐన = అయిన; తెఱంగునన్ = విధముగ; తత్ = ఆ; విభుండును = భగవంతుడు కూడ; సర్వ = అన్నిటి యందును; గతుండు = ఉండు వాడు; అయ్యును = అయినప్పటికిని; భిన్నుండు = వేరైనవాడు; కాడు = కాడు; తత్త్వవిదులు = తత్త్వవిద్య తెలిసినవారు; ఐన = అయిన; పెద్దలు = గొప్పవారు; తమ = వారి; లోనన్ = అందు; పరమాత్మ = పరమాత్మ; స్వరూపంబునన్ = స్వరూపములో; ఉన్న = ఉన్నట్టి; ఈశ్వరున్ = భగవంతుని; ఈ = ఈ; విధంబునన్ = విధముగ; ఎఱుంగుదురు = తెలిసికొందురు; జీవాత్మ = జీవుడైన అతని; కున్ = కి; పరుండు = ఇతరమైనవాడు; ఐన = అయిన; సర్వ = అన్నిటి యందును; మయుండు = నిండి యుండువాడు; తన = తన యొక్క; మాయ = మాయ; చేతన్ = వలన; రజంబును = రజోగుణమును; విశ్వంబున్ = ప్రపంచమును; సృజింపన్ = సృష్టింపవలెనని; కోరి = భావించియు; సత్త్వంబును = సత్త్వగుణమును; క్రీడింపన్ = క్రీడింపవలెనని; కోరి = భావించియు; తమంబును = తమోగుణమును; నిద్రింపన్ = నిద్రింపవలెనని; కోరి = భావించియు; ఉత్పాదించి = సృష్టించి; చరము = కదలెడి లక్షణము గలది; ఐన = అయిన; కాలంబును = కాలమును; సృజియించున్ = సృష్టించును; ఆ = ఆ; కాలంబునన్ = కాలము నందు; సర్వ = అన్నిటిని; దర్శనుండు = కాంచెడివాడు; ఐన = అయిన; ఈశ్వరుండును = భగవంతుడును; కాల = కాలుడు యనెడి; ఆహ్వయుండును = పేరు గలవాడు; ఐ = అయ్యి; హరి = విష్ణుమూర్తి; సత్త్వగుణంబున్ = సత్త్వగుణము గలవారు; ఐన = అయిన; దేవ = దేవతలు; అనీకంబున్ = సర్వుల; కున్ = కు; వృద్ధియున్ = పెంపును; రజస్ = రజస్సుయైన; తమస్ = తమస్సు యైన; గుణులు = గుణములు గలవారు; అయిన = ఐనట్టి; రాక్షసుల్ = రాక్షసుల; కున్ = కు; హానియున్ = నాశమును; చేయుచుండు = కలిగించుచుండును.

భావము:

ఓ మహారాజా! పరీక్షిత్తు! కృష్ణదైపాయనునకు ముందుగా నమస్కరించి పవిత్రమైన విష్ణుకథలు చెప్తాను, విను. శ్రీమన్నారాయణుడు ఇట్టివాడు అని తెలుసుకోలేము. ఆయన తత్వం ఎవరూ తెలుసుకోలేరు. ఆయన గుణవికారాలకు అతీతుడు. ప్రకృతికి అంటీ అంటనట్టు ఉండు వాడు. జన్మబంధాలలో చిక్కుట లేనివాడు. త్రిగుణాలకు అతీతుడు. ఆ పరమేశ్వరుడు తన మాయతో తానే గుణ వికారాలు కల్పించుకుని బాధలు పెట్టేవాడూ, బాధలు పడేవాడూ తానే అవుతాడు. లోకంలో సత్వగుణము, రజోగుణము, తమో గుణము అని మూడు రకాల గుణములు ఉన్నాయి. అవి ఒక్కొక్కప్పుడు తగ్గి ఉంటాయి. ఒక్కొక్కప్పుడు ప్రకోపిస్తుంటాయి. భగవానుడు “సత్వగుణం” ప్రధానంగా దేవతలను, మునులను; “రజోగుణం” ప్రధానంగా అసురులనూ; “తమోగుణం” ప్రధానంగా యక్షుల, రాక్షసుల సమూహాలను వేరువేరుగా సృష్టించాడు; సూర్యుడు వివిధప్రదేశాల నుండి వేరువేరుగా కనబడినప్పటికీ, ఒక్కడే అయినట్లుగా, అన్నిటిలోనూ, అందరిలోనూ సర్వకాల సర్వావస్థలలోను నివసిస్తున్నప్పటికిని వేరుకాడు, అతను ఒక్కడే. ఆ విధంగానే, తత్త్వం తెలిసిన జ్ఞానులు తమలో “ఆత్మ” స్వరూపంలో ప్రకాశించే దైవమును తెలుసుకుంటారు. “జీవాత్మ”కు ఇతరుడుగా కన్పిస్తూ ఉంటాడు. సర్వం తానే అయి, ప్రభువై, తన మాయాజాలంతో విశ్వాన్ని సృష్టించదలచి రజోగుణాన్ని, లీలా విలాసాలు చూపించ దలచి సత్వ గుణాన్ని, నిద్రింప దలచి తమోగుణాన్ని కలిగించి, నడుస్తూ ఉండే “కాలా”న్ని సృష్టించాడు. అట్టి కాలం వలన సర్వత్రా దర్శనం ఇచ్చే ఆ పరమేశ్వరుడు “కాలస్వరూపుడు” గా పిలువబడతాడు. అటువంటి ఆ స్వామి సత్వగుణ ప్రధానులైన దేవతలకు ఆనందాన్ని, తమోగుణ ప్రధానులైన రాక్షసులకు దుఃఖాన్ని కలిగిస్తూ ఉంటాడు.

7-8-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

నాయక! యీ యర్థము
యశుఁ డగు ధర్మజునకుఁ గ్రతుకాలమునన్
మును నారదుండు చెప్పెను
వినిపించెద వినుము చెవులు విమలత నొందన్.

టీకా:

జననాయక = రాజా {జననాయక - జనులకు నాయకుడు, రాజు}; ఈ = ఇట్టి; అర్థము = సందర్భము నందు; ఘన = గొప్ప; యశుడు = కీర్తి గలవాడు; అగు = అయిన; ధర్మరాజున్ = ధర్మరాజున; కున్ = కు; క్రతు = యజ్ఞ; కాలమునన్ = సమయము నందు; మును = పూర్వము; నారదుండు = నారదుడు; చెప్పెను = తెలియజెప్పెను; వినిపించెదన్ = చెప్పెదను; వినుము = వినుము; చెవులు = చెవులు; విమలతన్ = నిర్మలత్వమును; ఒందన్ = పొందునట్లుగా.

భావము:

జనులందరిని సరైన మార్గంలో నడిపించే ఓ పరీక్షిన్మహారాజా! ఇప్పుడు నీవడిగిన సంగతినే పూర్వం ధర్మవిదుడైన ధర్మరాజునకు రాజసూయయాగ సమయంలో ధర్మవిదు డైన నారదమహర్షి చెప్పాడు. ఇప్పుడు నీకు చెప్తాను చెవులకు పండువుగా విను,

7-9-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మున్ను ధర్మరాజు చేయు రాజసూయయాగంబున బాలుండైన శిశుపాలుండు హరిని నిందించి నిశిత నిర్వక్ర చక్రధారా దళిత మస్తకుం డయి తేజోరూపంబున వచ్చి హరిదేహంబు జొచ్చినం జూచి వెఱఁగు పడి ధర్మజుండు సభలోనున్న నారదునిం జూచి యిట్లనియె.

టీకా:

మున్ను = పూర్వము; ధర్మరాజు = ధర్మరాజు; చేయు = చేసెడి; రాజసూయ = రాజసూయము యనెడి {రాజసూయము - ఒకరాజు తక్కిన రాజులను జయించి చేసెడి యజ్ఞము}; యాగంబునన్ = యజ్ఞమునందు; బాలుండు = అజ్ఞాని; ఐన = అయిన; శిశుపాలుండు = శిశుపాలుడు {శిశుపాలుడు - శ్రీకృష్ణుని మేనత్త కొడుకు, చేదిదేశపు రాజు}; హరిని = శ్రీకృష్ణుని; నిందించి = తిట్టి; నిశిత = వాడియైన; నిర్వక్ర = వక్రము కాని; చక్ర = చక్రము యొక్క; ధారా = అంచులచే; దళిత = ఖండింపబడిన; మస్తకుండు = శిరస్సు గలవాడు; అయి = అయ్యి; తేజస్ = వెలుగు; రూపంబునన్ = రూపముతో; వచ్చి = చేరి; హరి = శ్రీకృష్ణుని; దేహంబున్ = శరీరమును; చొచ్చినన్ = ప్రవేశించగా, ఐక్యము కాగా; చూచి = చూసి; వెఱగుపడి = ఆశ్చర్యపోయి; ధర్మజుండు = ధర్మరాజు; సభ = సభావాటిక; లోనన్ = అందు; ఉన్న = ఉన్నట్టి; నారదునిన్ = నారదుని; చూచి = చూసి; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

పూర్వం ధర్మరాజు రాజసూయయాగం చేస్తున్నాడు. అజ్ఞాని అయిన శిశుపాలుడు శ్రీకృష్ణుని నిందించాడు. బహు వాడి అయిన సుదర్శన చక్రంతో కృష్ణుడు అతని తల ఖండించాడు. అతని ఆత్మ తేజోరూపంతో కృష్ణునిలో ఐక్యం అయింది. అది చూసి ఆశ్చర్యపోయి, ధర్మరాజు అప్పుడు అక్కడ సభలో ఉన్న నారదుడితో ఇలా అన్నాడు.

7-10-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"ట్టివారికైన నేకాంతులకు నైన,
చ్చి చొరఁగ రాని వాసుదేవు
త్త్వమందుఁ జేదిరణీశుఁ డహితుఁడై,
యెట్లు జొచ్చె? మునివరేణ్య! నేఁడు.

టీకా:

ఎట్టి = ఎటువంటి; వారి = వారల; కిన్ = కు; ఐనన్ = అయినప్పటికిని; ఏకాంతుల్ = అనన్యభక్తులు; కున్ = కు; ఐనన్ = అయినను; వచ్చిచొరగన్ = ఐక్యమగుటకు; రాని = సాధ్యము కాని; వాసుదేవు = విష్ణువు యనెడి; తత్త్వము = పరమాత్మ; అందున్ = లో; చేది = చేదిదేశపు; ధరణీశుడు = రాజు {ధరణీశుడు - ధరణి (రాజ్యమున)కు ఈశుడు (ప్రభువు), రాజు}; అహితుడు = శత్రువు; ఐ= అయి ఉండి; ఎట్లు = ఏ విధముగ; చొచ్చెన్ = ప్రవేశించెను; ముని = మునులలో; వరేణ్య = శ్రేష్ఠుడా; నేఁడు = ఇప్పుడు.

భావము:

“ఓ నారదా! ఎలాంటివారికైనా ఎంతటి అనన్యభక్తులకు అయినా ప్రవేశించడానికి సులభంకానట్టి ఆ మహా తత్వంలో, విష్ణు తత్వంలో శత్రుత్వం చూపుతున్న ఈ చేది దేశపు రాజు అయిన శిశుపాలుడు ఇంత సులువుగా ఎలా ఐక్యం అయ్యాడు; నీవు గొప్ప మునులలో మిన్న అయినవాడవు. నాకు ఇదెలా సాధ్యం అయిందో చెప్పు.

7-11-ఉ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వేనుఁడు మాధవుం దెగడి విప్రులు దిట్టిన భగ్నుఁడై తమో
లీనుఁడు గాఁడె తొల్లి; మదలిప్తుఁడు చైద్యుఁడు పిన్ననాట నుం
డేనియు మాధవున్ విన సహింపఁడు భక్తి వహింపఁ డట్టి వాఁ
డే నిబిడ ప్రభావమున నీ పరమేశ్వరునందుఁ జొచ్చెనో?

టీకా:

వేనుడు = వేను డనెడి మహారాజు {వేనుడు - పృథుచక్రవర్తి తండ్రి, అంగుని కుమారుడు}; మాధవున్ = విష్ణుమూర్తిని; తెగడి = నిందించి; విప్రులు = బ్రాహ్మణులు; తిట్టినన్ = శపించగా; భగ్నుడు = నశించినవాడు; ఐ = అయ్యి; తమస్ = చీకటిలోకమున, నరకమున; లీనుండు = కలిసినవాడు; కాడె = కాలేదా ఏమి, అయ్యెనుకదా; తొల్లి = పూర్వకాల మందు; మద = పొగరు; లిప్తుడు = పట్టినవాడు; చైద్యుడు = శిశుపాలుడు {చైద్యుడు -చేదిదేశపురాజు,శిశుపాలుడు}; పిన్ననాట = చిన్నతనము; నుండేనియున్ = నుండియును; మాధవున్ = శ్రీకృష్ణుని; వినన్ = వినుటనుకూడ; సహింపడు = ఓర్వడు; భక్తిన్ = భక్తిని; వహింపడు = కలిగి యుండడు; అట్టి = అటువంటి; వాడు = అతడు; ఏ = ఎట్టి; నిబిడ = దట్టమైన; ప్రభావమునన్ = మహిమవలన; ఈ = ఈ; పరమేశ్వరున్ = భగవంతుని; అందున్ = లో; చొచ్చెనో = లీనమయ్యెనో.

భావము:

పూర్వం వేనుడనే రాజు విష్ణుమూర్తిని దూషించగా, వేదమూర్తులు అయిన బ్రాహ్మణులు శపించారు; అతను అలా నరకంలో పడిపోయాడు కదా! ఈ పొగరుబోతు చేది దేశపు శిశుపాలునికి భక్తి ఎలాగూ లేదు; పైగా చిన్నప్పటి నుండి కృష్ణుడి మాటంటేనే మండిపడేవాడు కదా! అటువంటి వాడు ఇలా ఏ మహా మహిమతో కృష్ణమూర్తిలో లీనం అయ్యాడు?

7-12-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

రిసాధింతు హరిన్ గ్రసింతు హరిఁ బ్రాణాంతంబు నొందింతుఁ దా
రికిన్ వైరి నటంచు వీఁడు పటురోషాయత్తుఁడై యెప్పుడుం
దిరుగుం, బ్రువ్వదు నోరు, వ్రీలిపడ దా దేహంబు, దాహంబుతో
కప్రాప్తియు నొందఁ, డే క్రియ జగన్నాథుం బ్రవేశించెనో?

టీకా:

హరిన్ = శ్రీకృష్ణుని; సాధింతున్ = ఓడించెదను; హరిన్ = శ్రీకృష్ణుని; గ్రసింతున్ = మింగెదను; హరిన్ = శ్రీకృష్ణుని; ప్రాణాంతంబున్ = మరణమునకు; ఒందింతున్ = చెందించెదను; తాన్ = తను; హరి = శ్రీకృష్ణుని; కిన్ = కి; వైరిన్ = శత్రువును; అట = అని; అంచున్ = అనుచు; వీడు = ఇతడు; పటు = దట్టమైన; రోష = కోపము; ఆయత్తుడు = కలవాడు; ఐ = అయ్యి; ఎప్పుడున్ = ఎల్లప్పుడును; తిరుగున్ = వర్తించును; ప్రువ్వదు = పుచ్చిపోదు; నోరు = నోరు; వ్రీలి = విరిగి; పడదు = కూలిపోదు; ఆ = ఆ; దేహంబున్ = శరీరము; దాహంబు = యాతనల; తోన్ = తోటి; నరక = నరకమును; ప్రాప్తియున్ = చెందుటను; ఒందడు = పొందడు; ఏ = ఏ; క్రియన్ = విధముగ; జగన్నాథున్ = విష్ణువు నందు {జగన్నాథుడు - జగత్తునకు నాథుడు, విష్ణువు}; ప్రవేశించెనో = చేరెనో.

భావము:

ఈ శిశుపాలుడు ఎప్పుడూ రోషంతో, ద్వేషంతో తిరుగుతుండేవాడు; ఎప్పుడూ “కృష్ణుణ్ణి ఓడిస్తా, పట్టుకుంటా, చంపేస్తా, కృష్ణుడు నా ప్రాణ విరోధి” అంటూ ఉండే వాడు కదా! పుణ్యపురుషుని దూషించే వీడికి పురుగులు పట్టి నోరు ఎందుకు పుచ్చిపోలేదు; శరీరావయవాలు విరిగి పడిపోలేదు; దేహం దహించి నరకంలో పడిపోలేదు; పైగా ఎలా సర్వలోకాధి నాయకుడైన శ్రీహరిలో ప్రవేశించింది;

7-13-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

అదియునుం గాక, దంతవక్త్రుండును వీఁడును నిరంతరంబు గోవిందు నింద జేయుదురు; నిఖిలజనులు సందర్శింప నేఁడు వీనికి విష్ణు సాయుజ్యంబు గలుగుట కేమి హేతువు? వినిపింపుము; పవన చలితదీపశిఖయునుం బోలె నా హృదయంబు సంచలించుచున్న" దనిన, ధర్మనందనునకు నారదుం డిట్లనియె "దూషణభూషణతిరస్కారంబులు శరీరంబునకుం గాని పరమాత్మకు లేవు; శరీరాభిమానంబునం జేసి దండవాక్పారుష్యంబులు హింసయై తోఁచు తెఱంగున; నేను నాయది యనియెడు వైషమ్యంబును భూతంబులకు శరీరంబు నందు సంభవించు; నభిమానంబు బంధంబు; నిరభిమానుండై వధించినను వధంబుగాదు; కర్తృత్వ మొల్లని వానికి హింసయు సిద్ధింపదు; సర్వభూతాత్మకుండైన యీశ్వరునికి వైషమ్యంబు లేదు; కావున.

టీకా:

అదియునున్ = అంతే; కాక = కాకుండగ; దంతవక్త్రుండును = దంతవక్త్రుడు {దంతవక్త్రుడు - శిశుపాలుని తమ్ముడు}; వీడునున్ = ఇతడు; నిరంతరంబు = ఎల్లప్పుడును; గోవిందున్ = శ్రీకృష్ణుని; నిందన్ = తెగడుట; చేయుదురు = చేయుచుందురు; నిఖిల = ఎల్ల; జనులున్ = లోకులు; సందర్శింపన్ = చక్కగ చూచుచుండగా; నేఁడు = ఇప్పుడు; వీని = ఇతని; కిన్ = కి; విష్ణు = విష్ణుమూర్తి యందు; సాయుజ్యంబున్ = ఐక్య మగుట; కలుగుట = సంభవించుట; కున్ = కు; ఏమి = ఏమిటి; హేతువు = కారణము; వినిపింపుము = తెలుపుము; పవన = గాలికి; చలిత = కొట్టుకొనెడి; దీప = దీపము యొక్క; శిఖయున్ = మంట; పోలెన్ = వలె; నా = నా యొక్క; హృదయంబు = హృదయము; సంచలించుచున్నది = కలత నొందుచున్నది; అనినన్ = అనగా; ధర్మనందనున్ = ధర్మరాజున {ధర్మ నందనుడు - యమధర్మరాజు యొక్క పుత్రుడు, ధర్మరాజు}; కున్ = కు; నారదుండు = నారదుడు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను; దూషణ = తెగడుట; భూషణ = పొగడుట; తిరస్కారంబులు = అవమానించుటలు; శరీరంబున్ = దేహమున; కున్ = కు; కాని = కాని; పరమాత్మ = పరమాత్మ; కున్ = కు; లేవు = లేవు; శరీర = దేహ మందలి; అభిమానంబునన్ = అహంకారము; చేసి = వలన; దండ = కొట్టుట; వాక్పారుష్యంబులున్ = కఠినముగామాట్లాడుట; హింస = వధించుట; ఐ = జరుగునట్లు; తోచు = తెలియు; తెఱంగునన్ = విధముగ; నేను = నేను; నాయది = నాది; అనియెడు = అనెడి; వైషమ్యంబును = భేదభావము; భూతంబుల్ = జీవుల; కున్ = కు; శరీరంబున్ = దేహమున; అందున్ = అందు; సంభవించు = కలుగును; అభిమానంబు = అహంకారము; బంధంబు = బంధములు; నిరభిమానుండు = అభిమానము లేనివాడు; ఐ = అయ్యి; వధించినను = చంపినను; వధంబు = హత్య; కాదు = కాదు; కర్తృత్వము = కర్త యైన భావము; ఒల్లని = అంగీకరించనట్టి; వాని = అతని; కిన్ = కి; హింసయున్ = హత్యాపాపము; సిద్ధింపదు = కలుగదు; సర్వ = సమస్తమైన; భూత = జీవులు; ఆత్మకుండు = లోనుండువాడు, తానైనవాడు; ఐనన్ = అయినట్టి; ఈశ్వరున్ = భగవంతుని; కిన్ = కి; వైషమ్యంబున్ = భేదభావము,శత్రుత్వభావము; లేదు = లేదు; కావున = అందుచేత.

భావము:

ఇంతే కాకుండా, ఈ శిశుపాలుడూ, వీడి తమ్ముడు దంతవక్త్రుడూ ఎప్పుడూ కృష్ణుణ్ణి నిందించే వాళ్ళే కదా! అంతటి పాపీ ఇందరు చూస్తుండగా పరమ ముక్తి గమ్యమైన విష్ణుసాయుజ్యం ఎలా పొందాడు? ఈ సందేహం తీరక, గాలికి కొట్టుమిట్టాడే దీపంలా, నా హృదయం చలించిపోతోంది. దీనికి కారణం ఏమిటో చెప్పి నా సందేహం తీర్చు?” అన్నాడు. అప్పుడు నారదమహర్షి ఇలా అన్నాడు. “తిట్టినా, పొగిడినా అవి దేహానికే కాని ఆత్మకు, పరబ్రహ్మకు అంటవు; దండించటం, తిట్టటం, కొట్టటం వంటివి దేహం మీద మమకారంతో బాధ హింసలా తోస్తాయి; జీవులకు సహజమైన అహంకార మమకారాలు లేకుండా అభిమాన బంధం లేకుండా చంపేసినా కూడా అది హత్యా కాదు, పాపం అంటదు; చేసిన వాడిని నేను అనే కర్తృత్వం వదలిపెట్టిన వానికి జీవహింస, పాపాలు ఏవీ అంటవు; ఎల్ల జీవులలో అంతరాత్మగా ఉండే భగవానునికి భేదభావం అన్నది లేదు; ఎవరిమీదా దేనిమీదా ద్వేషంకానీ, విరోధంకానీ ఎప్పడూ ఎక్కడా విష్ణుమూర్తికి ఉండదు;

7-14-ఆ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

లుక నైనఁ జెలిమి నైనఁ గామంబున
నైన బాంధవమున నైన భీతి
నైనఁ దగిలి తలఁప ఖిలాత్ముఁ డగు హరిఁ
జేర వచ్చు వేఱు జేయఁ డతఁడు.

టీకా:

అలుకన్ = కోపముతో; ఐనన్ = అయినను; చెలిమిన్ = స్నేహముతో; ఐనన్ = అయినను; కామంబునన్ = కోరికతో; ఐనన్ = అయినను; బాంధవమునన్ = చుట్టరికముతో; ఐనన్ = అయినను; భీతిన్ = భయముతో; ఐనన్ = అయినను; తగిలి = పూని; తలపన్ = తరచి చూసినచో; అఖిలాత్ముడు = సర్వభూత స్వరూపుడు; అగు = అయిన; హరిన్ = నారాయణుని; చేరవచ్చును = చేరుట సాధ్యము; వేఱుచేయడు = భేదముగ చూడడు; అతడు = అతడు.

భావము:

ఆ స్వామి ఎవరినీ ఎప్పుడూ పరునిగా చూడడు. కోపంతో కానీ, స్నేహంతో కానీ, ఇష్టంతో కానీ, బంధుత్వంతో కానీ, భయంతో కానీ ఎలా అయినా సరే మనస్ఫూర్తిగా ఏకాగ్రంగా విష్ణునామాన్ని స్మరణ చేస్తే చాలు, సర్వ భూతాత్మకు డైన ఆ శ్రీమహావిష్ణువు సన్నిధానానికి చేర్చుకుంటాడు.

7-15-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

వైరానుబంధనంబునఁ
జేరిన చందమున విష్ణుఁ జిరతర భక్తిం
జేరఁగరా దని తోఁచును
నారాయణభక్తి యుక్తి నా చిత్తమునన్.

టీకా:

వైర = శత్రుత్వపు; అనుబంధనంబునన్ = సంబంధముతో; చేరిన = పొందిన; చందమునన్ = విధముగ; విష్ణున్ = నారాయణుని; చిరతర = చాలా ఎక్కువ కాలము చేసిన {చిరము - చిరతరము - చిరతమము}; భక్తిన్ = భక్తితో; చేరగన్ = చేరుటకు; రాదు = సాధ్యముకాదు; అని = అని; తోచును = అనిపించును; నారాయణ = విష్ణువు యెడలి; భక్తి = భక్తియనెడి; యుక్తిన్ = ఉపాయముతో; నా = నా యొక్క; చిత్తమునన్ = ఉద్దేశ్యములో.

భావము:

‘ఆ మహావిష్ణువును విశృంఖలమైన విరోధంతో చేరినంత సుళువగా, బహు అధికమైన విష్ణుభక్తి మార్గమున చేరలేము’ అని నాకైతే మనసులో అనిపిస్తుంది.

7-16-క.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కీకముఁ దెచ్చి భ్రమరము
పావమున బంభ్రమింప భ్రాంతంబై త
త్కీకము భ్రమరరూపముఁ
బాటించి వహించుఁ గాదె యయోగమునన్.

టీకా:

కీటకమున్ = పురుగును; తెచ్చి = తీసుకొని వచ్చి; భ్రమరము = తుమ్మెద; పాటవమునన్ = నేర్పుతో; బంభ్రమింపన్ = చుట్టుతిరుగగా; భ్రాంతంబు = భ్రాంతిలో పడినది; ఐ = అయ్యి; తత్ = ఆ; కీటకము = పురుగు; భ్రమర = తుమ్మెద యొక్క; రూపమున్ = స్వరూపమును; పాటించి = విడువక; వహించున్ = ధరించును; కాదె = కాదా; భయ = భయము యొక్క; యోగమునన్ = సంబంధముతో.

భావము:

తుమ్మెద పురుగును తీసుకువచ్చి, ఝంకారం చేస్తూ దానిచుట్టూ తిరుగుతుంది. ఆ పురుగు భయంతో ఆ పురుగునే విడువకుండా చూస్తూ భ్రాంతిపడి, తుమ్మెదగా మారిపోతుంది కదా! అలాగే భయంవల్లగానీ, నయంవల్లగానీ, స్మరణవల్లగానీ, శ్రవణంవల్లగానీ శ్రీహరి సామీప్యం పొందవచ్చు.

7-17-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

ఇవ్విధంబున.

టీకా:

ఇవ్విధంబునన్ = ఈ విధముగ.

భావము:

ఇలాగే

7-18-శా.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

కామోత్కంఠత గోపికల్, భయమునం గంసుండు, వైరక్రియా
సామాగ్రిన్ శిశుపాలముఖ్య నృపతుల్, సంబంధులై వృష్ణులున్,
బ్రేమన్ మీరలు, భక్తి నేము, నిదె చక్రింగంటి; మెట్లైన ను
ద్ధా ధ్యానగరిష్ఠుఁ డైన హరిఁ జెందన్ వచ్చు ధాత్రీశ్వరా!

టీకా:

కామ = మన్మథ వికారము నందలి; ఉత్కంఠతన్ = ఆసక్తితో; గోపికల్ = గోపికలు; భయమునన్ = భయముతో; కంసుండు = కంసుడు; వైర = విరోధపు; క్రియన్ = చేతల; సామగ్రిన్ = బలమున; శిశుపాల = శిశుపాలుడు; ముఖ్య = మున్నగు; నృపతుల్ = రాజులు; సంబంధులు = చుట్టరికము గల వారు; ఐ = అయ్యి; వృష్ణులున్ = యాదవులు {వృష్ణులు - వృష్ణివంశపు యాదవులు}; ప్రేమన్ = ప్రేమతో; మీరలు = మీరు; భక్తిన్ = భక్తితో; ఏమున్ = మేము; ఇదె = ఇదిగో; చక్రిన్ = విష్ణుమూర్తిని {చక్రి – చక్రము ధరించిన వాడు, హరి}; కంటిమి = దర్శించితిమి; ఎట్లు = ఏ విధముగ; ఐనన్ = అయినప్పటికిని; ఉద్దామ = ఉన్నత మైన; ధ్యాన = ధ్యానముచే; గరిష్ఠుడు = శ్రేష్ఠుడు; ఐన = అయిన; హరిన్ = నారాయణుని; చెందన్ = పొంద; వచ్చు = సాధ్యము; ధాత్రీశ్వరా = రాజా {ధాత్రీశ్వరుడు - ధాత్రి (భూమి)కి ఈశ్వరుడు (ప్రభువు), రాజు}.

భావము:

ధర్మరాజా! మన్మథ వికారముతో గోపికలు, ప్రాణభయంతో కంసుడు, విరోధంతో శిశుపాలుడు మొదలైన రాజులు, దాయాదులు అయ్యి యాదవులు, బంధుప్రీతితో మీరు, భక్తితో మేము నిరంతర స్మరణలు చేసి విష్ణుసాయుజ్యం పొందాము కదా. ఏ విధంగా అయినా సరే విడవకుండా ధ్యానించి నారాయణుని పొందవచ్చును.

7-19-వ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

మఱియుం బెక్కండ్రు కామ ద్వేష భయ స్నేహ సేవాతిరేకంబులఁ జిత్తంబు హరిపరాయత్తంబుగాఁ జేసి తద్గతిం జెందిరి; హరి నుద్దేశించి క్రోధాదులైన యేనింటిలోపల నొక్కటి యైన వెన్నునికి లేని నిమిత్తంబున నతండు వ్యర్థుం డయ్యె; మీ తల్లి చెలియలి కొడుకు లయిన శిశుపాల దంతవక్త్రులు దొల్లి విష్ణుమందిర ద్వారపాలకులు; విప్రశాపంబునఁ బదభ్రష్టులై భూతలంబున జన్మించిరి." అనిన విని యుధిష్ఠిరుండు నారదున కిట్లనియె.

టీకా:

మఱియున్ = ఇంకను; పెక్కండ్రు = అనేకమంది; కామ = కోరిక; ద్వేష = విరోధము; భయ = భయము; స్నేహ = ప్రేమ; సేవా = భక్తుల; అతిరేకంబులన్ = అతిశయముతో; చిత్తంబున్ = మనసును; హరి = విష్ణువు; పర = అందు; ఆయత్తంబు = లగ్నమైనది; కాన్ = అగునట్లు; చేసి = చేసికొని; తత్ = అతని; గతిన్ = పదమును; చెందిరి = పొందిరి; హరిన్ = హరిని; ఉద్దేశించి = గురించి; క్రోధ = కోపము {పంచక్రోధాదులు - 1కామ 2క్రోధ 3భయం 4నయం 5భక్తి}; ఆదులు = మొదలైనవి; ఐన = అయిన; ఏనింటి = ఐదింటి (5); లోపల = అందలి; ఒక్కటి = ఒకటి; ఐనన్ = అయినను; వెన్నుని = వేనున; కిన్ = కు; లేని = లేకపోయినట్టి; నిమిత్తంబునన్ = కారణముతో; అతండు = అతడు; వ్యర్థుండు = నిష్ప్రయోజకుడు; అయ్యె = ఆయెను; మీ = మీ; తల్లి = తల్లి యొక్క; చెలియలి = చెల్లెలి; కొడుకులు = పుత్రులు; అయిన = ఐన; శిశుపాల = శిశుపాలుడు; దంతవక్త్రులు = దంతవక్త్రుడులు; తొల్లి = పూర్వము; విష్ణు = విష్ణుమూర్తి; మందిర = నివాసమునకు; ద్వారపాలకులు = వాకిలి కావలివారు; విప్ర = బ్రాహ్మణుల; శాపంబునన్ = శాపమువలన; పద = పదవినుండి; భ్రష్టలు = తొలగినవారు; ఐ = అయ్యి; భూతలంబునన్ = భూలోకమునందు; జన్మించిరి = పుట్టిరి; అనినన్ = అనగా; విని = ఆలకించి; యుధిష్ఠిరుండు = ధర్మరాజు; నారదున్ = నారదున; కిన్ = కు; ఇట్లు = ఈ విధముగ; అనియె = పలికెను.

భావము:

ఇంకా ఇలా చాలామంది ఆ రమామనోహరుడగు విష్ణుమూర్తిని సేవించి, ప్రేమించి, కామించి, ద్వేషించి, భయపడి సదాస్మరిస్తూ మోక్షాన్ని పొందారు. విపరీతంగా భయపడి, భంగపడి కొందరు, విడువరాని విరోధం, క్రోధం పెంచుకుని కొందరు, ఎడతెగని స్నేహం పెంచుకొని కొందరు, ఏకాంత భక్తితో సేవించి కొందరు, మనస్ఫూర్తిగా కామించి కొందరు మనస్సును మాధవునికే అంకింతం చేసి సద్గతిని పొందారు. కానీ శ్రీహరి పట్ల తీవ్రమైన కామం, క్రోధం, భయం, స్నేహం, భక్తి అనే ఈ అయిదింటిలోనూ ఏఒక్కటీ లేకపోవటం చేత, నీవు చెప్పిన వేనుడు భ్రష్టుడై మరణించాడు. కాని మీ పినతల్లి కొడుకులైన శిశుపాలుడు, దంతవక్త్రుల విషయం అలా కాదు. పూర్వం వారిరువురు వైకుంఠంలో విష్ణుమందిర ద్వారపాలకులు. అటువంటి మహాభక్తులూ, ఒకానొక సమయంలో సనకసనందాదులు అనే విప్రుల శాపం పొంది పదవులు కోల్పోయి, భూలోకంలో పుట్టారు” అని దేవర్షి అయిన నారదుడు చెప్పగా విని, ధర్మరాజు నారదుడితో ఇలా అడిగాడు.

7-20-మ.
 • ఉపకరణాలు:
 •  
 •  
 •  

"లుగం గారణ మేమి విప్రులకు? ము న్నా విప్రు లెవ్వారు? ని
శ్చలు లేకాంతులు నిర్జితేంద్రియులు నిస్సంసారు లీశాను వ
ర్తులు వైకుంఠపురీనివాసు లన విందున్ వారి కెబ్భంగి నీ
జన్మంబులు వచ్చె? నారద! వినం గౌతూహలం బయ్యెడిన్."

టీకా:

అలుగన్ = కోపించుటకు; కారణము = కారణము; ఏమి = ఏమిటి; విప్రుల్ = బ్రాహ్మణుల; కున్ = కు; మున్ను = పూర్వము; ఆ = ఆ; విప్రులు = బ్రాహ్మణులు; ఎవ్వారు = ఎవరు; నిశ్చలులు = చపలతలేనివారు; ఏకాంతులు = అంతరంగభక్తులు; నిర్జితేంద్రియులు = ఇంద్రియముల నణచిన వారు; నిస్సంసారులు = సంసార బంధములు లేనివారు; ఈశానువర్తులు = భగవంతు ననుసరించు వారు; వైకుంఠ = వైకుంఠము యనెడి; పురీ = పురమునందు; నివాసులు = నివసించెడివారు; అనన్ = అని; విందున్ = విన్నాను; వారి = వారల; కిన్ = కి; ఏ = ఏ; భంగిన్ = లాగున; ఈ = ఇట్టి; ఖల = నీచ; జన్మంబులు = పుట్టుకలు; వచ్చెన్ = కలిగినవి; నారద = నారదుడా; వినన్ = వినవలెనని; కౌతూహలంబు = ఉత్సుకత; అయ్యెడిన్ = కలుగుచున్నది.

భావము:

“ఓ నారదమునీంద్రా! ఆ వేదమూర్తులైన ఆ విప్రులు ఎవరు? వారికి ఆగ్రహం ఎందుకు వచ్చింది; విష్ణుమందిర ద్వారపాలకులు ‘నిశ్చలమైన, భక్తి ప్రపత్తులు కలవారు; ఏకాంత దాసుల; ఇంద్రియజయం కలవారు; సంసారబంధాలలో తగుల్కొనని వారు; నిరంతరం జగన్నాథుని ఆజ్ఞను పాటించేవారు; సాక్షాత్తు వైకుంఠంలో నివసించే వారు’. అటువంటి వాళ్ళు విప్రశాపానికి ఎలా గురయ్యారు? వాళ్ళకి దుష్టజన్మలు ఎలా కలిగాయి? ఇదంతా వినాలని కుతూహలంగా ఉంది చెప్పండి.”