పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : నారదుని పూర్వజన్మంబు

  •  
  •  
  •  

7-476-వ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

అని యిట్లు విశ్వస్రష్టలు శపించిన నొక బ్రాహ్మణదాసికిఁ బుత్రుండ నై జన్మించి యందు బ్రహ్మవాదు లైన పెద్దలకు శుశ్రూష చేసిన భాగ్యంబున ని మ్మహాకల్పంబు నందు బ్రహ్మపుత్రుండనై జన్మించితి.

టీకా:

అని = అని; ఇట్లు = ఈ విధముగ; విశ్వస్రష్టలు = లోకకర్తలు; శపించినన్ = శపించగా; ఒక = ఒక; బ్రాహ్మణ = విప్రుల యింటి; దాసి = పనిగత్తె; కిన్ = కు; పుత్రుండను = కుమారుడను; ఐ = అయ్యి; జన్మించి = పుట్టి; అందున్ = దాని(ఆజన్మ)లో; బ్రహ్మవాదులు = బ్రహ్మజ్ఞానులు; ఐన = అయిన; పెద్దల = గొప్పవారి; కున్ = కి; శుశ్రూష = సేవ; చేసిన = చేసినట్టి; భాగ్యంబునన్ = అదృష్టమువలన; ఈ = ఈ; మహాకల్పంబున్ = మహాకల్పము; అందున్ = లో; బ్రహ్మపుత్రుండను = బ్రహ్మదేవుని కుమారుడను {నారదుడు - బ్రహ్మదేవుని మానస పుత్రుడు}; ఐ = అయ్యి; జన్మించితి = పుట్టితిని.

భావము:

అలా విశ్వ సృష్టి కర్తలచేత శపింపబడిన నేను, బ్రాహ్మణుల ఇంటిలో దాసిగా ఉన్న ఒక శూద్రురాలికి కొడుకుగా పుట్టాను. అక్కడ పెద్ద బ్రహ్మవేత్తలు కొందరకు చాలా కాలం శుశ్రూషలు చేశాను. ఆ సేవా ప్రభావం వలన ఈ మహా కల్పంలో బ్రహ్మ మానసపుత్రుడను అయి పుట్టాను.