పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-466-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

విషయ శత్రు లెల్ల విక్రాంతితోడ సా
థిసమేతుఁ డయిన థికుఁ బట్టి
యుగ్ర తిమిరమృత్యు యుత మగు సంసార
కూపమధ్య మందుఁ గూల్తు రధిప!

టీకా:

విషయ = ఇంద్రియార్థములనెడి; శత్రులు = శత్రువులు; ఎల్లన్ = అందరును; విక్రాంతి = పరాక్రమము; తోడన్ = తోటి; సారథి = (బుద్ధి) సారథితో; సమేతుండు = కూడినవాడు; అయిన = ఐన; రథికున్ = (జీవుని) రథికుని; పట్టి = పట్టికొని; ఉగ్ర = భయంకరమైన; తిమిర = కారుచీకటి యనెడి; మృత్యు = చావుతో; యుతము = కూడినది; అగు = అయిన; సంసార = సంసారము యనెడి; కూప = బావి; మధ్యము = నడిమి; అందున్ = అందు; కూల్తురు = కూల్చివేయుదురు; అధిపా = రాజా.

భావము:

ఆ విషయాలనే శత్రువులు అన్నీ విజృంభించి సారథి సమేతంగా రథికుడిని పట్టుకుని, భీకరమైనదీ అంధకారావృతమైనదీ మృత్యుగహ్వరమూ అయిన సంసార కూపంలో కూల్చివేస్తాయి.