పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-464.1-తే.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

శుద్ధజీవుండు బాణంబు, శుభదమైన
బ్రహ్మ మంచిత లక్ష్యంబు, రులు రాగ
య మదద్వేష శోక లోప్రమోహ
మాన మత్సర ముఖములు మానవేంద్ర!
^నారద తత్వశాస్త్ర సంకేత పదాలు

టీకా:

రథము = బండి; మేను = దేహము; ఎల్లన్ = అంతయు; సారథి = బండినడిపేవాడు; బుద్ధి = బుద్ధి; ఇంద్రియ = ఇంద్రియముల; గణము = సమూహము; గుఱ్ఱములు = గుఱ్ఱములు; పగ్గములు = నియంత్రించెడితాళ్ళు; మనము = మనస్సు; ప్రాణాది = ప్రాణము మున్నగు; దశవిధపవనంబు = పదిప్రాణవాయువులు {దశవిధపవనములు - పంచవాయువులు (1ప్రాణము 2అపానము 3ఉదానము 4వ్యానము 5సమానము) మరియు పంచోపవాయువులు (1నాగము 2కూర్మము 4కృకరము 4దేవదత్తము 5ధనంజయము)}; ఇరుసు = చక్రములకు ఆధారకడ్డీ; ధర్మ = ధర్మము; అధర్మ = అధర్మములయొక్క; గతులు = వర్తనములు; రథాంగకములు = బండిచక్రములు; బహుళతరంబు = చాలాయెక్కువరకములది {బహుళము - బహుళతరము - బహుళతమము}; ఐన = అయిన; బంధంబు = కట్టుతాళ్ళు; చిత్తంబు = చిత్తము; శబ్దాదికములు = ఇంద్రియ విషయములు {శబ్దాది - 1శబ్దము 2స్పర్శము 3రూపము 4రసము 5గంథములు, ఇంద్రియవిషయములు}; సంచారభూములు = బండితిరిగెడితావులు; అభిమాన = అహంకార మమకారములతో {అభిమానము - నేను నాది యనెడి భావములైన అహంకార మమకారములు}; సంయుతుండు = కూడినవాడు; అయిన = ఐన; జీవుండు = జీవుడు, ఆత్మ; రథి = బండిలోనుండెడి ప్రధానపురుషుడు; ఘనతర = బహుగొప్పదైన {ఘన - ఘనతర - ఘనతమము}; ప్రణవంబు = ఓంకారము; కార్ముకంబు = విల్లు.
శుద్ధజీవుండు = నిర్మలమైన జీవాత్మ; బాణంబు = బాణము; శుభదము = శుభము(ముక్తి)నిచ్చునది; ఐన = అయిన; బ్రహ్మము = బ్రహ్మము; అంచిత = ఒప్పిదమైన; లక్ష్యంబు = గురి; పరులు = శత్రువులు; రాగ = తగులము; భయ = భయము; మద = పొగరు; ద్వేష = పగ; శోక = దుఃఖము; లోభ = లోభము; మోహ = మోహము; మాన = అభిమానము; మత్సర = మాత్యర్యము; ముఖములు = మున్నగునవి; మానవేంద్ర = రాజా {మానవేంద్రుడు - మానవులకు ఇంద్రునివంటివాడు, రాజు}.

భావము:

ఓ యుధిష్ఠర నరేంద్రా! తత్వశాస్త్రం అవగాహన చేసికో. ఈ దేహమే రథం; బుద్ధి సారథి; ఇంద్రియాలు గుఱ్ఱములు; మనస్సు కళ్ళెం; ప్రాణ, అపాన, వ్యాన, ఉదాన, సమాన, నాగ, కూర్మ, కృకర, దేవదత్త, ధనంజయము లనే దశ విధ వాయువులులోని (పంచ ప్రాణవాయువులు పంచ ఉపవాయువులు రెండూ) ఇరుసులు; ధర్మం, అధర్మం రథచక్రాలు; చిత్తం కఠినమైన బంధం; శబ్ద, రస, రూప, స్పర్శ, గంధం అనే ఇంద్రియ విషయములు సంచార భూములు; అహంకార సమేతుడైన జీవుడు రథం అధిరోహించిన రథికుడు; ఘనమైన ప్రణవం ధనుస్సు; శుద్ధ జీవుడు బాణం; బ్రహ్మమే పరమ లక్ష్యం; రాగం, భయం, మదం, ద్వేషం, శోకం, లోభం, మోహం, అహంకారం, మాత్సర్యం మొదలగునవి అడ్డుపడే బద్ధ శత్రువులు