పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-463-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

వ్రతము మానఁదగదు డుగు గుఱ్ఱనికిని
గ్రియలు మానఁదగదు గృహగతునికి
పసి కూర నుండగదు సన్న్యాసికిఁ
రుణితోడి పొత్తు గదు తగదు.

టీకా:

వ్రతమున్ = దీక్షను; మానన్ = మానివేయుట; తగదు = తగినదికాదు; వడుగు = బ్రహ్మచారి; కుఱ్ఱని = బాలుని; కిని = కి; క్రియలు = నిత్యనైమిత్తికాది క్రియలు; మానన్ = మానివేయుట; తగదు = తగినదికాదు; గృహగతుని = గృహస్థుని; కిన్ = కి; తపసి = వానప్రస్థుని; కిన్ = కి; ఊరన్ = గ్రామమందు; ఉండన్ = ఉండుట; తగదు = తగినదికాదు; సన్యాసి = సన్యసించిన యతి; కిన్ = కి; తరుణి = స్త్రీ; తోడి = తోటి; పొత్తు = సాంగత్యము; తగదుతగదు = తగినది కాదేకాదు.

భావము:

బ్రహ్మచారి తన ఆశ్రమ నియమాలు దీక్షలు మానరాదు; గృహస్థు నిత్యనైమిత్త కాది క్రియలు విడువ కూడదు; వానప్రస్థుడు తపస్సు చేసుకోవాలి గాని ఊరిలో ఉండరాదు; సన్న్యాసికి స్త్రీసాంగత్యం ఏమాత్రం పనికిరాదు. బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్న్యాసం అనే చతురాశ్రమాలకు చెప్పబడిన ధర్మాలను ఆయా ఆశ్రమంలో ఉన్నవారు అతిక్రమించ రాదు.