పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-461-మ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ణీదేవుఁడు సన్న్యసించి యతియై ర్మార్థకామంబులం
రివర్జించి పునర్విలంబమునఁ దత్ప్రారంభి యౌనేని లో
తిం గ్రక్కిన కూడు మంచి దనుచున్ క్షించి జీవించు దు
ర్నరు చందంబున హాస్యజీవనుఁ డగున్ నానాప్రకారంబులన్.

టీకా:

ధరణీదేవుడు = బ్రాహ్మణుడు {ధరణీదేవుడు - ధరణీ (భూమికి) దేవుడు, విప్రుడు}; సన్యసించి = సర్వసంగపరిత్యాగము జేసి; యతి = యోగి; ఐ = అయ్యి; ధర్మార్థకామంబులన్ = పురుషార్థములను {పురుషార్థములు - 1ధర్మ 2అర్థ 3కామములు యైన పురుషప్రయోజనములు}; పరివర్జించి = పూర్తిగావదలివేసి; పునః = మరల; విలంబమునన్ = కొంతకాలము తరువాత; తత్ = వాటిని (ధర్మాదులను); ప్రారంభి = మరల పూనినవాడు; ఔనేని = అయినచో; లోభ = లోభపు; రతిన్ = మిక్కిలి యాశచేత; కక్కిన = వాంతిచేసుకొన్న; కూడున్ = అన్నమును; మంచిది = మంచిది; అనుచున్ = అనుచు; భక్షించి = తిని; జీవించు = బ్రతికెడి; దుర్ = నీచపు; నరున్ = మానవుని; చందంబునన్ = వలె; హాస్య = పరిహసింపదగిన; జీవనుండు = బ్రతుకుగలవాడు; అగున్ = అగును; నానా = పలు; ప్రకారంబులన్ = తెఱంగుల.

భావము:

విప్రుడు సన్న్యసం స్వీకరించి, ధర్మార్థ కామాలను విసర్జించి యోగిగాగౌరవం పొందుతాడు. కాని, పిమ్మట యతి ధర్మాలు సరిగా నిర్వర్తించక మరల వెనుకకు సంసార చక్రంలోకి వస్తే అపుడు అతడు, లోభంతో కక్కిన కూడు తిని సంతుష్టి పొందే అధముడి లాగా రకరకాలుగా పరిహాసపాత్రుడు అవుతాడు