పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-458-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

రిమహిమ దనకుఁ జెప్పిన
గురువున్ నరుఁ డనుచుఁ దలఁచి కుంఠితభక్తిం
దిరుగు పురుషు శ్రమ మెల్లను
రిశౌచము క్రియ నిరర్థకం బగు నధిపా!

టీకా:

హరి = విష్ణుని; మహిమన్ = ప్రభావము, గొప్పదనము; తన = తన; కున్ = కు; చెప్పిన = చెప్పినట్టి, ఉపదేశించిన; గురువును = దేశికుని; నరుడు = సామాన్యమానవుడు; అనుచున్ = అని; తలచి = భావించి; కుంఠిత = భంగపడిన, కుంటి; భక్తిన్ = భక్తితో; తిరుగు = వర్తించెడి; పురుషు = మానవుని; శ్రమము = కష్టము; ఎల్లను = అంతా; కరి = గజ; శౌచము = శుచిత్వము; క్రియన్ = వలె; నిరర్థకంబు = వ్యర్థమైనది; అగున్ = అగును; అధిపా = రాజా.

భావము:

మహారాజా! శ్రీమహావిష్ణువు మహిమను తనకు తెలియజెప్పిన గురువును సామాన్యమానవుడు అని భావిస్తు కుంటి భక్తితో వర్తించెడి వాని జీవితం గజస్నానము వలె వ్యర్థమైనది.