పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-454-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

ఖిలలోకములకు రి దైవతము చూడ
రికి దైవతము ధరాధినాథ!
దపరాగలేశ పంక్తిచేఁ ద్రైలోక్య
పావనంబు జేయు బ్రాహ్మణుండు.

టీకా:

అఖిల = సర్వ; లోకముల్ = లొకముల; కున్ = కు; హరి = నారాయణుడు; దైవతము = అత్యుత్తమదేవుడు {దైవము - దైవతర - దైవతము}; చూడన్ = విచారించగా; హరి = నారాయణుని; కిన్ = కి; దైవతము = ఉత్తమదేవుడు; ధరాధినాథ = రాజా {ధరాధినాథుడు - ధర (భూమిక్) అధినాథుడు (పైఅధికారి), రాజు}; పద = పాదముల; పరాగ = దుమ్మునందలి; లేశ = కొంచపు; పంక్తి = రేణువుల; చేన్ = వలన; త్రైలోక్య = ముల్లోకముల; పావనంబు = పవిత్రము; చేయు = చేసెడి; బ్రాహ్మణుండు = విప్రుడు.

భావము:

పృథివీపతీ! ధర్మరాజా! సమస్తమైన లోకాలకు విష్ణువే అధిదేవుడు. ఆ శ్రీమన్నారాయణునికి దైవము తన పాద పరాగ లేశము వలన ముల్లోకాలనూ పావనం చేసే బ్రాహ్మణుడు.