పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-452-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

భూవరేంద్ర! యిట్టి పుణ్యప్రదేశంబు
లందు నరుడు చేయు ట్టి ధర్మ
ల్పమైన నది సస్రగుణాధిక
లము నిచ్చు హరికృపావశమున.

టీకా:

భూవరేంద్ర = మహారాజా {భూవరేంద్ర - భూవరుల (రాజుల)లో ఇంద్రుడు (శ్రేష్ఠుడు), మహారాజు}; ఇట్టి = ఇటువంటి; పుణ్యప్రదేశంబులు = పుణ్యక్షేత్రముల; అందున్ = లో; నరుడు = మానవుడు; చేయునట్టి = చేసెడి; ధర్మము = పుణ్యకార్యము; అల్పము = కొంచెము; అయినన్ = అయినను; అది = అది; సహస్ర = వేయి; గుణ = రెట్లుకంటెను; అధిక = ఎక్కువ; ఫలమున్ = ఫలితమును; ఇచ్చున్ = ఇచ్చును; హరి = విష్ణుని; కృపా = దయ; వశమున = వలన.

భావము:

యుధిష్ఠర మహారాజా! ఇటువంటి పుణ్యక్షేత్రాలలో చేసిన ధర్మకార్యం, శ్రీహరి దయావిశేషం వలన, వెయ్యి రెట్లు అధికమైన ఫలమును ప్రసాదిస్తుంది.