పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ఆశ్రమాదుల ధర్మములు

  •  
  •  
  •  

7-446-ఆ.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

నక గురుల నైనఁ జంపు నర్థమున కై
ప్రాణమైన విడుచు భార్యకొఱకు
ట్టి భార్యఁ బురుషుఁ తిథి శుశ్రూష చే
యించి గెలుచు నజితు నీశు నైన.

టీకా:

జనక = తండ్రి; గురువులన్ = గురువులను; ఐనన్ = అయినను; చంపున్ = సంహరించును; అర్థమున్ = ధనములు; కై = కోసము; ప్రాణము = తనప్రాణము; ఐనన్ = అయినప్పటికి; విడుచున్ = వదలిపెట్టును; భార్య = భార్య; కొఱకున్ = కోసము; అట్టి = అటువంటి; భార్యన్ = భార్యను; పురుషుడు = మానవుడు; అతిథి = అతిథుల యొక్క; శుశ్రూష = సేవను; చేయించి = చేయించుటచేత; గెలుచున్ = గెలుచును; అజితున్ = గెలువశక్యముగానివానిని; ఈశున్ = ఈశ్వరుని; ఐనన్ = అయినను;

భావము:

మానవుడు డబ్బులు కోసం తండ్రినైనా, గురువులనైనా సంహరిస్తాడు. ఇది లోక సహజం. కాని భార్యకోసం డబ్బులేమిటి, ప్రాణాలైనా ధారపోస్తాడు. అటువంటి భార్యచేత అతిథులకు శుశ్రూషలు చేయించి, అజితుడు పరమేశ్వరుడు అయిన భగవంతుని అనుగ్రహం సైతం సంపాదించవచ్చును