పోతన తెలుగు భాగవతము

పోతన తెలుగు భాగవతము

సప్తమ స్కంధము : ప్రహ్లాదాజగర సంవాదము

  •  
  •  
  •  

7-437-క.
  • ఉపకరణాలు:
  •  
  •  
  •  

గరమును జుంటీఁగయు
నిగురువులుగాఁ దలంచి నిశ్చింతుఁడ నై
వినస్థలిఁ గర్మంబుల
జిబిజి లేకున్నవాఁడ గౌరవవృత్తిన్.

టీకా:

అజగరమును = కొండచిలువ; జుంటీగయున్ = తేనెటీగలు; నిజ = నిజమైన; గురువులు = మార్గదర్శకులుగ; తలంచి = భావించి; నిశ్చింతుడను = విచారములనుబాసిన వాడను; ఐ = అయ్యి; విజన = నిర్జన, ఎవరులేని; స్థలిన్ = చోటునందు; కర్మంబులన్ = కర్మములవలని; గజిబిజి = కలతలు; లేక = లేకుండగ; ఉన్నవాడన్ = ఉన్నాడను; గౌరవ = మంచి, మునుల; వృత్తిన్ = నడవడికతో.

భావము:

కొండచిలువ, తేనెటీగ నాకు గురువులుగా స్వీకరించాను. వాటి నుంచి నేను సుగుణాలను నేర్చుకున్నాను. నిశ్చింతగా, ఇలా ఈ నిర్జన ప్రదేశంలో ఏ కర్మబంధాల గందరగోళం లేకుండా ముని వృత్తిలో ఇలా జీవిస్తున్నాను.